Begin typing your search above and press return to search.

`జూప‌ల్లి`ని ప‌ట్టించుకునేవారేరీ?

By:  Tupaki Desk   |   22 Jan 2023 4:06 AM GMT
`జూప‌ల్లి`ని ప‌ట్టించుకునేవారేరీ?
X
ఆయ‌న మాజీ మంత్రి. ముఖ్యంగా ఒక‌ప్పుడు త‌న‌కంటూ తిరుగులేద‌నే ధోర‌ణితో ముందుకు సాగిన నాయ‌కు లు. అయితే.. ఇప్పుడు ఆ ప్ర‌భావం లేకుండా పోయింది. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి గ‌తంలో గెలిచిన జూప‌ల్లి కృష్ణారావుకు ఇప్పుడు ఎన్నిక‌ల బాధ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నికల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డం.. మ‌రో ఆరు మాసాల్లోనే టికెట్లు క‌న్ఫ‌ర్మ్ అయ్యే సూచ‌న‌లు ఉండ‌డంతో ఆయ‌న దిగులు పెట్టుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని.. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పోందాల‌ని జూప‌ల్లి ప్ర‌య‌త్ని స్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న‌ను అధికార పార్టీలో ప‌ట్టించుకునేవారు లేకుండా పోయారు. 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లోకొల్లా పూర్ నుంచి పోటీ చేసిన జూప‌ల్లి.. ఆ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన హ‌ర్ష వ‌ర్ధ‌న్‌రెడ్డి ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఓడిపోయినా.. త‌న‌కు ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆశించిన‌... జూప‌ల్లికి.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి టీఆర్ ఎస్ గూటికి చేర‌డంతో ప్రాధాన్యం లేకుండా పోయింది. క‌నీసం.. ఆయ‌న‌కు అప్పాయింట్‌మెంట్ ఇచ్చే నాయ‌కులు కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే విష‌యం సందిగ్ధంలోనే ఉంది. మ‌రో వైపు కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్ ఇస్తామ‌ని చెప్ప‌డంతో జూప‌ల్లి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టు అయింది.

ఈ ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌రెడ్డి.. టికెట్ త‌న‌కేన‌ని, కొంద‌రు న‌కిలీ నాయ‌కులు ఉన్నార‌ని వారి మాట‌లు న‌మ్మొద్ద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇది కూడా కొన్నాళ్లుగా ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధాన్ని రాజేసింది. దీంతో ఇప్పుడు జూప‌ల్లి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప‌రిస్థితి ఇక్క‌డ బాగున్నా.. జూప‌ల్లిని ఇక్క‌డి కాంగ్రెస్ నాయ‌కులు స‌మ‌ర్ధించ‌డం లేదు. దీంతో జూప‌ల్లికి ఎటూ దారి క‌నిపించ‌క అల్లాడుతున్నారు. అంతేకాదు.. టికెట్ విష‌యం ఎత్త‌గానే ఫైర్ అవుతున్నార‌ట‌. ఇదీ.. సంగ‌తి!