Begin typing your search above and press return to search.

ప‌రుగులు తీయించిన గ్యాంగ్ రేప్ ఉదంతం!

By:  Tupaki Desk   |   9 Aug 2018 4:55 AM GMT
ప‌రుగులు తీయించిన గ్యాంగ్ రేప్ ఉదంతం!
X
బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌ లోని మీడియా వ‌ర్గాల్లో ఒక సంచ‌ల‌న అంశం వైర‌ల్ గా మారింది. మ‌రీ.. ముఖ్యంగా క్రైం రిపోర్ట‌ర్ల‌లోఈ స‌మాచారం కాసేపు హ‌డావుడి.. అల‌జ‌డిని రేకెత్తించింది. ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఒక జూనియ‌ర్ ఆర్టిస్ట్ గ్యాంగ్ రేప్ న‌కు గుర‌య్యారంటూ అందిన స‌మాచారం ఉరుకులు ప‌రుగులు పెట్టేలా చేసింది.

తొలుత అందిన స‌మాచారానికి.. చివ‌ర‌కు తేలిన స‌మాచారానికి పొంత‌న లేక‌పోవ‌టంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏదైనా భారీ క్రైం ఏదైనా జ‌రిగింద‌న్న మాట వినిపిస్తే చాలు.. వాట్సాప్ గ్రూపుల‌తో పాటు.. మీడియా ఆఫీసుల నుంచి హ‌డావుడి భారీగా ఉంటోంది. ఒక జూనియ‌ర్ ఆర్టిస్ట్ గ్యాంగ్ రేప్ న‌కు గుర‌య్యార‌న్న స‌మాచారంతో అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం.. వెంట‌నే స‌మాచారం ల‌భించ‌క‌పోవ‌టంతో కాస్తంత గంద‌ర‌గోళం చోటు చేసుకుంది.

అనంత‌రం ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో న‌మోదైన కేసు వివ‌రాల ప్ర‌కారం చూస్తే.. గుంటూరుకు చెందిన శిరీష‌.. హేమ లంగ‌ర్ హౌస్ లోని ఒక హాస్ట‌ల్లో ఉంటున్నారు. వీరిద్ద‌రూ జూనియ‌ర్ ఆర్టిస్ట్ లుగా ప‌ని చేస్తున్నారు. వీరి ఫ్రెండ్ మ‌రొక‌రు ఎల్లారెడ్డిగూడ‌లోని మ‌రో హాస్ట‌ల్ లో ఉంటోంది. ఇదిలా ఉంటే.. కొద్దికాలం క్రితం ఎల్లారెడ్డి గూడ‌లో ఉండే యువ‌తికి రాజ్ కిర‌ణ్ అనే ఆర్టిస్ట్ పరిచయం అయ్యారు. వీరి స్నేహం చ‌నువుగా మారి.. ఆమెకు ద‌గ్గ‌ర్లోని హాస్ట‌ల్లో చేరాడు.

వీరంతా క‌లిసి వేషాలు రాక ఇబ్బందులు ప‌డే ఆర్టిస్ట్‌ లు.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం మ‌న పేరుతో ఒక సంస్థ‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా ఈ సంఘంలో స‌భ్య‌త్వం కోసం కొంత డ‌బ్బును వ‌సూలు చేశారు. ఈ లెక్క‌ల‌తో వారి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో బాధితురాలిని.. శిరీష‌.. హేమ‌ల‌ను తీసుకొని ఈ ఏడాది మార్చిలో గుంటూరుకు తీసుకెళ్లాడు రాజ్ కిర‌ణ్‌. అక్క‌డ ఒక లాడ్జిలో ఉంచాడు. ఆ స‌మ‌యంలో బాధితురాలికి హేమ‌.. శిరీష‌లు మ‌త్తుమందు ఉన్న కూల్ డ్రింక్ ను ఇవ్వ‌టం.. ఆమె మ‌త్తులో జారిన త‌ర్వాత రాజ్ కిర‌ణ్ తో పాటు.. మ‌రో ముగ్గురు లైంగిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి తెలిసిన‌ప్ప‌టికీ బాధితురాలు నోరు విప్ప‌లేదు. తాను నోరు విప్పితే త‌న‌కు ల‌భించే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌న్న భ‌యంతో ఆమె మిన్న‌కుండిపోయింది. అయితే.. అత్యాచారానికి సంబంధించిన ఫోటోలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని.. వాటిని నెట్ లో పెడ‌తాన‌ని రాజ్ కిర‌ణ్ బెదిరించ‌టంతో బాధితురాలు పోలీసుల్ని ఆశ్ర‌యించి.. అత‌డిపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. అత్యాచారానికి గురైన మూడు నెల‌ల త‌ర్వాత బాధితురాలు ఫిర్యాదు చేయ‌టం.. ఈ ఇష్యూలో ఆర్థిక లావాదేవీల అంశం ఉండ‌టంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పోలీసుల విచార‌ణ‌లో అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. గ్యాంగ్ రేప్ అన్న స‌మాచారంతో ప‌రుగులు తీసిన మీడియాకు.. చివ‌ర‌కు మూడు నెల‌ల క్రితం జరిగింద‌న్న మాట‌తో పాటు.. మ‌రిన్ని విష‌యాల మీద వ‌స్తున్న సందేహాలు వారిని అయోమ‌యానికి గుర‌య్యేలా చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.