Begin typing your search above and press return to search.
ఒక రోజు.. ఎన్ని తీపిగురుతులో..!
By: Tupaki Desk | 11 July 2015 4:49 AM GMTఒక రోజు. ఒకే ఒక రోజు. ఆ రోజులో ఎన్నో విశేషాలు. అవన్నీ కలకాలం దాచుకునే తీపిగరుతులే కావటం విశేషం. అంతేకాదు.. భవిష్యత్తు పరిణామాలకు నాందిగా చోటు చేసుకున్నాయి. ఒకేరోజులో ఇలాంటివెన్నో అంశాలు జరగటం కాస్తంత విచిత్రమే.
మరి.. ఆ తీపిగురుతుల్ని చూస్తే..
= తెలుగోడి సత్తా చాటేలా.. హాలీవుడ్ కన్ను పడేలా.. బాలీవుడ్‌కి షాక్ ఇచ్చేలా.. టాలీవుడ్ సత్తా చాటిన చిత్రం బాహుబలి. దర్శకుడు రాజమౌళి రెండున్నరేళ్లకు పైగా చెక్కిన శిల్పం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తుంది. అద్భుతం.. మహాఅద్భుతం మాదిరి లేకున్నా.. వెండి తెరపై మెరుపులు మెరిపిస్తున్న బాహుబలి సినిమా చూసిన బయటకొచ్చిన ప్రతిఒక్కరూ చెప్పే మాట.. ''తెలుగు సినిమా స్థాయిని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది'' అని.
= వినోదపరంగా బాహుబలి రిలీజ్ కారణంగా మధ్యాహ్నం వరకూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు.. కర్ణాటక.. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బాహుబలిచర్చే. మిగిలిన చోట కంటే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక పెద్ద పండగ తలపించేలా ప్రతిఒక్కరూ బాహుబలి జపం చేశారు. టీవీ.. వెబ్‌సైట్లు ఇలా ఏ మీడియం చూసినా బాహుబలి ప్యానిక్‌తో ఊగిపోయాయి.
= బాహుబలి విషయాన్ని పక్కన పెడితే.. తెలుగు ప్రాంతాల వారు గర్వపడేలా మరో మూడు ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.
= టెన్నిస్ సంచలనం.. హైదరాబాదీ సానియా మీర్జా వింబుల్డన్ డబుల్స్ సెమీస్‌లో విజయం సాధించి.. ఫైనల్స్‌కు చేరుకుంది. మరో అడుగు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయితే.. వింబుల్డన్ గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా రికార్డుల్లోకి ఎక్కటం ఖాయం. టైటిల్ గెలుపు సంగతి కాసేపు పక్కన పెట్టినా.. ఫైనల్స్‌కు చేరటం అంత చిన్న విషయం ఏమీ కాదు.
= ఇక.. జింబాబ్వే సిరీస్‌లో భారతజట్టులోని తెలుగు సంచలనం.. రాయుడు దుమ్ము దులిపేశాడు. 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను తన అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీ చేసి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాయుడు కానీ సెంచరీ చేయకుండా మరో అవమాన భారం ఎదురయ్యేది.
= భారతదేశ కీర్తి ప్రతిష్ఠల్ని ప్రపంచానికి తెలియజేసేలా.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట ఇస్రో కేంద్రం నుంచి శుక్రవారం రాత్రి ప్రయోగించిన ఐదు ఉప గ్రహాలతో కూడిన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. భారత కీర్తి పతాకాన్ని అంతరిక్ష రంగంలో రెపరెపలాడేలా చేసింది.
= వీటన్నింటితో పాటు.. మరో కీలకాంశం కూడా చోటు చేసుకుంది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో కీలక భేటీ అంతర్జాతీయ వేదిక మీద జరిగింది. భారత ప్రధాని మోడీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీప్‌లు ఇద్దరూ ఏడాది తర్వాత భేటీ అయ్యారు. పలు అంశాల మీద చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు.. ఇరు దేశాల మధ్యనున్న సమస్యలు తీరేందుకు ఈ భేటీ కీలకం అవుతుందని అంచనా వేస్తున్నారు.