Begin typing your search above and press return to search.

స్వలింగ వివాహాలతో అనర్థం.. నిషేధించాల్సిందే

By:  Tupaki Desk   |   29 March 2023 11:00 PM GMT
స్వలింగ వివాహాలతో అనర్థం.. నిషేధించాల్సిందే
X
భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తుల బృందం బుధవారం బహిరంగ లేఖ విడుదల చేసింది. "మేము మాజీ న్యాయమూర్తులం, భారతదేశ పౌరులు, భారతీయ వివాహ సంప్రదాయాలు , కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా స్వార్థ ప్రయోజనాల సమూహాలు చేస్తున్న నిరంతర దాడిపై విసుగు చెంది, వేదనకు గురవుతున్నాం. అలాంటి ఒక సమస్య - స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం" అని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని, రాజ్యాంగ ధర్మాసనానికి సూచించిన తర్వాత దేశంలో ఇటీవలి కాలంలో నిరసనగా రాసిన ఈ లేఖ సంచలనమైంది.

స్వలింగ వివాహాలతో సమాజానికి తీవ్ర నష్టం. భారతీయ సమాజాన్ని దెబ్బతీసే సంస్కృతులు దేశంలోకి ప్రవేశిస్తుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. స్వలింగ వివాహాలతో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా అనేక దుష్ప్రభావాల నేపథ్యంలో పిటీషనర్లు వెనక్కి తగ్గితే మంచిది’ అని 21 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు.

"దేశ కుటుంబ వ్యవస్థను బలహీనపరిచేందుకు జరుగుతున్న కుట్ర ఇదీ. భారతీయ సమాజం , సంస్కృతిపై స్వలింగ వివాహాలు పెనుప్రభావం చూపుతాయి., ఈ పాశ్చాత్య దృక్పథం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నాం" అని లేఖలో జడ్జీలు పేర్కొన్నారు.

మాజీ న్యాయమూర్తుల బృందం భారతదేశంలో వివాహం , కుటుంబ వ్యవస్థ బలమైనదిగా ఉండాలని.. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం కుటుంబ వ్యవస్థ యొక్క మూలాలను దెబ్బతీస్తుందని, తద్వారా సమాజంపై వినాశకరమైన ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడ్డారు.

స్వలింగ వివాహము మన వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం. దీన్ని సమాజం గట్టిగా వ్యతిరేకించాలని లేఖలో పేర్కొన్నారు.

భారతీయ సాంస్కృతిక నాగరికత శతాబ్దాలుగా నిరంతరం దాడి చేయబడుతోంది, అయితే అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మనుగడ సాగించింది. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో, రిటైర్డ్ న్యాయమూర్తుల బృందం పాశ్చాత్య ఆలోచనలు, తత్వాలు ,సాంస్కృతిక మూలాలపై దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం వల్ల హెచ్‌ఐవి-బాధితుల సంఖ్య విపరీతంగా పెరగవచ్చు. జీవించే హక్కు కంటే ఎంపిక చేసుకునే హక్కు , వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని మాజీ న్యాయమూర్తుల బృందం పేర్కొంది.

స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించడం అనేది మొత్తం వ్యక్తిగత స్వరూపాన్ని మారుస్తుందని వారు పేర్కొన్నారు

బహిరంగ లేఖపై సంతకం చేసిన 21 మందిలో రాజస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఎస్‌ఎన్ ఝా, జస్టిస్ (రిటైర్డ్) ఎంఎం కుమార్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, గుజరాత్ లోకాయుక్త జస్టిస్ (రిటైర్డ్) ఎస్‌ఎం సోనీ , రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ధింగ్రా తదితరులు ఉన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.