Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ను వణికించింది వారేనట..
By: Tupaki Desk | 13 Dec 2016 8:47 AMమూడున్నరేళ్ల కిందట.. హైదరాబాద్ ను వణికించిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు గుర్తుండే ఉంటాయి. ఆ ఉగ్రవాద దుశ్చర్య వెనుక ఉన్నది ఇండియన్ ముజాహిదీన్లని తేలింది. ఈ మేరకు కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. జంట పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. ఆరుగురు నిందితులు నేరం చేసినట్లు రుజువైంది. వీరికి శిక్షలను ఈ నెల 19వ తేదీన శిక్ష ఖరారు చేస్తారు.
మూడున్నరేళ్ల పాటు విచారణ జరిపిన ఎన్ ఐఏ ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్ తో పాటు మరో నలుగురు నిందితులను దోషులుగా పేర్కొంది. ఎన్ ఐఏ మొత్తం 5,244 మందిని సాక్షులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ క్రాస్ రోడ్స్ - కోణార్క్ థియేటర్ వద్ద ఉన్న టిఫిన్ సెంటర్లో ఫిబ్రవరి 21 - 2013లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి.
ఆ తరువాత ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ ను నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. యాక్షన్ పార్టీలో ఉన్న ఉగ్రవాదులంతా ఎవరికీ అనుమానం రాకుండా నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ లో ఉంటూ అక్కడి నుంచే ఆపరేషన్ చేపట్టడంతో స్థానికులు అప్పట్లో హడలిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/