Begin typing your search above and press return to search.

గిరిజన మహిళపై అత్యాచారం. జడ్జి అరెస్ట్

By:  Tupaki Desk   |   15 Aug 2018 12:27 PM IST
గిరిజన మహిళపై అత్యాచారం. జడ్జి అరెస్ట్
X
హైదరాబాద్ పోలీసులు మంగళవారం ఓ జూనియర్ సివిల్ జడ్జిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తనపై జడ్జి అత్యాచారం చేశాడని ఓ గిరిజన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్జిని అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ లోని దోమలగూడలో నివసించే పి. సత్యనారాయణ అనే జూనియర్ సివిల్ జడ్జి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. జడ్జి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి చాలాసార్లు శారీరకంగా అనుభవించాడని.. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని హైదరాబాద్ లోని అశోక్ నగర్ కి చెందిన యువతి ఆరోపించింది. ఈ నెల 3న చిక్కడపల్లి ఠాణాలో బాధిత యువతి ఈ మేరకు జడ్జిపై అత్యాచారం - మోసం చేశాడని ఫిర్యాదు చేసింది.

ప్రాథమిక విచారణ అనంతరం.. జడ్జి కావడంతో అరెస్ట్ చేసేందుకు వీలుగా హైకోర్టు అనుమతి తీసుకున్నారు పోలీసులు. అనంతరం సత్యనారాయణపై ఐపీసీ 376 - 379 - 419 సెక్షన్ల కింద అత్యాచారంతో పాటు ఎస్సీ - ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. నాంపల్లి కోర్టులో హాజరు పరిచామన్నారు.