Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: విచారణకు హాజరు కాని మాజీ మేయర్.?

By:  Tupaki Desk   |   6 Jun 2022 9:31 AM GMT
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: విచారణకు హాజరు కాని మాజీ మేయర్.?
X
హైదరాబాద్ లోని అమ్మేషియా పబ్ నుంచి బయటకు వచ్చిన మైనర్ (బాలిక)పై గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లిహిల్స్ బాలిక రేప్ కేసు విచారణ క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఎఫ్ఐఆర్ లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి పేరును చేర్చడం సంచలనమైంది. మాజీ మేయర్, ఎంఐఎం కార్పొరేటర్ ను ఇవాళ విచారణకు పిలిచారు. అయితే ఆయన మాత్రం విచారణకు హాజరు కాలేదు.

కారులో బాలిక వీడియోలు వైరల్ పై పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. వీడియోను మీడియా ముందు ప్రదర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై కేసు నమోదు అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రిలీజ్ చేసిన ఆధారాల్లో ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలించారు. ఈ దృశ్యాలను లీగల్ ఒపినీయన్ కు పంపారు. ఇప్పటికే బాలిక వీడియోలు వైరల్ చేసిన యూట్యూబ్ చానెళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ చానెల్ కు చెందిన సుభాన్ ను అరెస్ట్ చేశారు.

ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న బెంజ్, ఇన్నోవా కారులో ఆదివారం ఫోరెన్సిక్ టీమ్స్ ఆధారాలు సేకరించాయి. ఇన్నోవాలో కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. బెంజికారులో చెప్పుల జతతోపాటు రెండు షటిల్ కాక్ లు, టేపు, శానిటైజర్, మాస్కులు, చార్జింగ్ వైర్లు దొరికాయి.

నిందితులకు ఆ కార్పొరేటర్ సహకరించాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో మెయినాబాద్ వరకూ కార్పొరేటర్ కూడా వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫాంహౌస్ కూడా కార్పొరేటర్ పేరు మీదే ఉన్నట్లు తెలుస్తోంది.

అమ్మేషియా పబ్ సిబ్బందిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రప్పించారు పోలీసులు. మే 28న ఏం జరిగిందనే దానిపై ఆరాతీశారు. పబ్ సిబ్బంది స్టేట్ మెంట్లను రికార్డ్ చేశారు. ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్ ను విచారించనున్నారు. ఈ అత్యాచారం కేసులో ఇప్పటివరకూ నలుగురిని అరెస్ట్ చేశారు.

తాజాగా మరో బాలుడిని కర్ణాటకలోని గుల్బార్గాలో అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు.