Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ అత్యాచారంపై ముగిసిన నిందితుల క‌స్ట‌డీ.. ఏం చెప్పారంటే..

By:  Tupaki Desk   |   13 Jun 2022 3:30 PM GMT
జూబ్లీహిల్స్ అత్యాచారంపై ముగిసిన నిందితుల క‌స్ట‌డీ.. ఏం చెప్పారంటే..
X
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచ‌ల‌నం రేపిన జూబ్లీహిల్స్‌లో అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఐదుగురు మైనర్లకు నాలుగో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితులను ప్రశ్నించిన పోలీసులు అత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించారు. అయితే.. ఈ విచార‌ణ‌లో ట్విస్టుల‌పై ట్విస్టులు చోటు చేసుకు న్నాయి. నిందితులు ఒక‌రిపై ఒక‌రు అభియోగాలు మోపుకొన్నారు. తానంటే.. తానంటూ.. ఒకరిపై ఒక‌రు నింద‌లు వేసుకున్నారు.

జూబ్లీహిల్స్‌లో అత్యాచారం కేసులో ఐదుగురు మైనర్లను సోమ‌వారంతో పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగో రోజు కస్టడీలో తీసుకు న్న పోలీసులు నిందితులను దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 12 గంటలకు జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. సాయంత్రం విచారణ ముగియగానే మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు.

ఓ కార్పొరేటర్ కుమారుడే మొదట లైంగిక దాడికి పాల్పడినట్లు నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా గుర్తించిన పోలీసులు.. దానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా మైనర్లను ప్రశ్నించిన సమయంలో అత్యాచారానికి సంబంధించి ఒకరిపై, ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సాదుద్దీన్ రెచ్చగొట్టడంతోనే అత్యాచారం చేసినట్లు మైనర్లు చెప్పగా.... ప్రజాప్రతినిధి కుమారుడే మొదట అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత మిగతా వాళ్లం అత్యాచారం చేసినట్లు సాదుద్దీన్ పోలీసులకు వివరించారు.

సీన్ రీ కన్స్ట్రక్షన్ సందర్భంగా సేకరించిన వివరాల ఆధారంగా మైనర్లను ప్రశ్నించి కొంత సమాచారం సేకరించారు. సాదుద్దీన్కు కస్టడీ ముగియడంతో ఈరోజు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇక‌, దీనిపై చార్జిషీట్ న‌మోదు చేయాల్సి ఉంది. మ‌రి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.