Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ లో ఆ పబ్ గుట్టు రట్టు..షాకింగ్ నిజం బయటకు

By:  Tupaki Desk   |   26 April 2020 10:51 AM IST
జూబ్లీహిల్స్ లో ఆ పబ్ గుట్టు రట్టు..షాకింగ్ నిజం బయటకు
X
షాకింగ్ నిజం బయటకు వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నట్లుగా భావిస్తున్న పోలీసు శాఖ ఉలిక్కిపడే వైనం వెల్లడైంది. సంపన్నులకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే జూబ్లీహిల్స్ లోని ఒక పబ్ లో రహస్యంగా మద్యాన్ని అమ్ముతున్న వైనాన్ని శనివారం రాత్రి టాస్క్ ఫోర్సు సిబ్బంది రట్టు చేశారు. లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. సీక్రెట్ ఆఫైర్స్ పబ్ యజమాని పాడు పని చేస్తున్న వైనాన్ని గుర్తించారు.

పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్సు సిబ్బంది సదరు పబ్ పై దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.15 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. లాక్ డౌన్ వేళలో అన్ని పబ్ లు మూతపడటమే కాదు.. వాటి వైపు కూడా చూడట్లేదు పబ్ నిర్వాహకులు. ఇందుకు భిన్నంగా సీక్రెట్ ఆఫైర్స్ ఓనర్ మాత్రం.. గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని అమ్మేస్తున్నాడు.

తాజాగా జరిపిన దాడిలో ఒక నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గడిచిన కొద్దిరోజులుగా రహస్యంగా మద్యాన్ని సప్లై చేసిన వైనాన్ని గుర్తించారు. పోలీసుల కళ్లు గప్పి.. అర్థరాత్రి వేళలోనూ.. తెల్లవారుజామున మద్యాన్ని అమ్మేవారని గుర్తించారు. పబ్ పేరుకు తగ్గట్లే.. సీక్రెట్ గా జరుపుతున్న లిక్కర్ ఆఫైర్ బయటకు రావటం షాకింగ్ గా మారింది. ఇలాంటి వ్యవహారాల్లో పబ్ లు మాత్రమే కాదు.. ఇలాంటి వాటిని ప్రోత్సహించే కస్టమర్ల సంగతి చూస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.