Begin typing your search above and press return to search.

వైఎస్సార్ జగన్ని అలా చూడాలనుకున్నారా....?

By:  Tupaki Desk   |   15 Feb 2023 4:00 PM GMT
వైఎస్సార్ జగన్ని అలా చూడాలనుకున్నారా....?
X
దివంగత నేత వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి అయిదుంపావు ఏళ్ళు సీఎం గా రెండు దఫాలుగా పనిచేశారు. ఆయన మరణించి జనం గుండెల్లో చెరగని స్థానం సంపాదించారు. ఆయన వారసుడిగా కుమారుడు జగన్ ఏపీకి సీఎం అయ్యారు. దాని వెనక జగన్ కఠోర పరిశ్రమ పట్టుదల చాలా ఉంది.

అయితే జగన్ దృష్టిలో జగన్ తండ్రికి వారసుడు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. సీఎం అయ్యారు అనుకుంటారు. జగన్ కి రాజకీయాలు ఇష్టమే అని ఆయన నడిచిన తోవను పట్టి తెలుస్తోంది. మరి వైఎస్సార్ కి తమ కుమారుడిని ఎలా చూడాలని ఉంది అంటే దానికి చాలా రకాలుగా కధనాలు వినిపించాయి.

జగన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఉద్దేశ్యం వైఎస్సార్ కి లేదు అని కూడా దగ్గర వారి సన్నిహితులు చెప్పినట్లుగా ప్రచారం లో ఉన్న సంగతులు. మరి జగన్ని వైఎస్సార్ ఎలా చూడాలనుకున్నారు అంటే మంచి బిజినెస్ మాగ్నెట్ గా అని అంటూంటారు.

ఈ విషయాన్ని ఈ రోజు కడప జిల్లాలో సున్నపురాళ్ళపల్లెలో జిందాల్ వారి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్బంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్న జే ఎస్ డబ్ల్య్లు చైర్మన్ సజ్జన్ జిందాల్ చెప్పుకొచ్చారు. తనకు మహా నేత వైఎస్సార్ మంచి మిత్రుడు అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

తాను వైఎస్సార్ ని మొదటిసారి కలసినపుడు జగన్ యువకుడు అని ఆయన ఫ్లాష్ బ్యాక్ వివరాలు గుర్తు చేసుకున్నారు. ఆనాడు తనకు వైఎస్సార్ చెప్పిన మాట ఏంటి అంటే జగన్ని తన వద్దకు రప్పించుకుని వ్యాపార సూత్రాలు నేర్పాలని కోరారని అన్నారు. అలా వైఎస్సార్ కోరిక మేరకు ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం జగన్ తొలిసారి ముంబైలోని తన ఆఫీసుకు కూడా వచ్చారని సజ్జన్ జిందాల్ గత స్మృతులు నెమరేసుకున్నారు.

అలా జగన్ బిజినెస్ మ్యాన్ కావాల్సి ఉందని సజ్జన్ ఎవరికీ తెలియని ఒక విషయాన్ని చెపుకొచ్చారు. అయితే జగన్ ఆ తరువాత కాలంలో అంటే 2009లో ఎంపీ అయ్యారు. అతి తక్కువ సమయంలోనే తండ్రి వైఎస్సార్ మరణించడంతో జగన్ తన పోరాటాన్ని మొదలెట్టి మొత్తానికి ఏపీకి సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల పాలనను జగన్ పూర్తి చేసుకోబోతున్నారు.

అదే టైంలో సజ్జన్ అన్న మరో మాట ఏంటి అంటే జగన్ యంగ్ అండ్ డైనమిక్ సీఎం అని, ఏపీ రూపురేఖలు మార్చేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు అని. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్సార్ చాలా కష్టపడి రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్నారు. రాజకీయాల్లో ఆటుపోట్లు బాగా ఎరిగిన ఆయన తన వారసులను అందులోకి తీసుకురావాలనుకోలేదు అని కూడా అంటారు.

ఇపుడు సజ్జన్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే జగన్ మంచి వ్యాపారవేత్తగానే సెటిల్ అవ్వాలని వైఎస్సార్ కోరుకున్నారు అన్న మాట. ఇక కడప ఎంపీ అయినా జగన్ వ్యాపార రంగంలోనే కొనసాగి ఉండేవారు. కానీ తండ్రి ఆకస్మిక మరణం ఆయన్ని పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా మార్చేసింది అని గత చరిత్ర చూస్తే అర్ధమవుతోంది.

ఇక ఒక వేళ వైఎస్సార్ మరణించకుండా అయిదేళ్ల పాటు సీఎం గా కొనసాగి ఉంటే జగన్ కచ్చితంగా బిజినెస్ లోనే పూఒర్తి స్థాయిలో స్థిరపడి సక్సెస్ ఫుల్ గా కొనసారే వారేమో అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఎవరైనా నమ్మాలి. జగన్ జీవితం ఇలా అనేక కీలకమైన మలుపులు తిరిగి ఈ రోజు ఏపీ సీఎం గా ఆయన ఉన్నారు. సో ఇది ఆయన పట్టుదల తోనే సాధ్యపడలేదు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాసిపెట్టి ఉంది కాబట్టే జరిగింది అని అన్న వారూ ఉన్నారు.