Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్ ను లాగుతున్న ట్రంప్ జూనియర్

By:  Tupaki Desk   |   16 Jan 2021 8:30 AM GMT
ఎలాన్ మస్క్ ను లాగుతున్న ట్రంప్ జూనియర్
X
అత్యున్నత స్థానంలో ఉండి.. వివాదాలతో పదవి నుంచి వైదొలిగే పరిస్థితిని తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కూడా అధికారాన్ని విడిచి పెట్టేందుకు ససేమిరా అనటం.. మద్దతుదారుల్ని క్యాపిటల్ హిల్ మీదకు ఉసిగొల్పటం లాంటి విపరీత చర్యలతో తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ మీద చర్యలకు సోషల్ మీడియా సంస్థలు ఒకటి తర్వాత ఒకటి నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ విషయంలో మిగిలిన వారి కంటే ముందుగా ట్రంప్ అధికారిక ట్విటర్ అకౌంట్ ను శాశ్వితంగా నిషేధిస్తే.. ఆతర్వాత ఫేస్ బుక్.. యూ ట్యూబ్ కు అలాంటి నిర్ణయాన్నే తీసుకోవటం తెలిసిందే. ఈ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వేళ.. ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ కొత్త వాదనను తెర మీదకు తెచ్చారు.

స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకు కొత్త సోషల్ మీడియాను తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. అందుకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఈ రంగంలోకి రావాలని కోరారు. అమెరికా భావస్వేచ్ఛను కాపాడేందుకు సరైనోడివంటూ ట్రంప్ జూనియర్ చేసిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన పనేదో తాను చేసుకుంటూ.. వ్యాపార రంగంలో దూసుకెళుతున్న ఎలన్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీదకు రావాలంటూ ట్రంప్ జూనియర్ మాట.. ఆయన్నీ వివాదంలోకి లాగటమే అంటున్నారు. మరి.. ట్రంప్ జూనియర్ చేసిన వ్యాఖ్యకు ఎలన్ మస్క్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.