Begin typing your search above and press return to search.

విడ్డూరం : గంగా నదిలో జూ. సిద్ధూ నిశ్చితార్థం

By:  Tupaki Desk   |   27 Jun 2023 2:47 PM GMT
విడ్డూరం : గంగా నదిలో జూ. సిద్ధూ నిశ్చితార్థం
X
భారత మాజీ క్రికెటర్.. మాజీ పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గత ఏడాది 34 ఏళ్ల క్రితం కేసులో దోషిగా తేలి 10 నెలల పాటు జైలు శిక్షను అనుభవించి మొన్న ఏప్రిల్‌ లో విడుదల అయిన విషయం తెల్సిందే. జైలు నుండి విడుదల అయిన తర్వాత సిద్ధూ ఎక్కువగా ఫ్యామిలీ తో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈసారి సిద్ధూ షేర్ చేసిన ఫోటోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సిద్ధూ తనయుడు కరణ్‌ సిద్ధూ వివాహ నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. సాధారణంగా అయితే నిశ్చితార్థం ఫోటోలనే లైట్ తీసుకోవచ్చు.

కానీ జూనియర్ సిద్ధూ అయిన కరణ్ సిద్ధూ యొక్క వివాహ నిశ్చితార్థం గంగా నది నీటిలో జరగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గంగా నదిలో జరిగిన తన కొడుకు యొక్క నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేసిన సిద్ధూ.. నా తనయుడు తన తల్లి కోరిక ను తీర్చాడు.

పవిత్ర దుర్గా అష్టమి వ్రత తిథి నాడు గంగా మాత ఒడిలో నిశ్చితార్థం చేసుకుని కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. మా కోడలు ఇనాయత్‌ రంధావా. వీరిద్దరు ఉంగరాలు మార్చుకుని ఒక్కటి కాబోతున్నారు అంటూ ట్విట్టర్ లో ఫోటోలు షేర్‌ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు.

పాటియాలాకు చెందిన మనీందర్ రంధావా కుమార్తె ఇనాయత్‌. గతంలో మనీందర్ ఇండియన్ ఆర్మీలో పని చేశారు. పంజాబ్ డిఫెన్స్ లో ప్రస్తుతం సేవలు అందిస్తున్న మనీందర్ కు ఉన్న సన్నిహిత్యంతో సిద్ధూ తన కొడుకు మరియు ఆయన కుమార్తె కు వివాహం జరిపించబోతున్నారు.