Begin typing your search above and press return to search.

జల్లికట్టులో జూనియర్ ఎన్టీఆర్ సందడి

By:  Tupaki Desk   |   14 Jan 2021 5:00 AM IST
జల్లికట్టులో జూనియర్ ఎన్టీఆర్ సందడి
X
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమిళనాడు సరిహద్దున గల చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఈ పండుగ సందర్భంగా ఈసారి తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ తో సందడి చేశారు ఫ్యాన్స్. చిత్తూరు జిల్లాలో జరిగిన జల్లికట్టు పోటీలలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో తమ పౌరుషాన్ని అభిమానులు చూపెట్టారు.పోట్ల గిత్తెలకు ఎన్టీఆర్ ఫొటో కట్టి వాటిని పోనిస్తూ సవాళ్లు చేశారు.

చామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జరిగిన వేడుకల్లో పోట్ల గిత్తలను అందంగా ముస్తాబు చేసిన తారక్ ఫ్యాన్స్.. ఆ గిత్తలకు ఎన్టీఆర్ ఫొటోలను పెట్టి సందడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సహజంగా ఈ పోట్లగిత్తెలకు దేవుళ్ల ఫొటోలను పెట్టి బరిలోకి దించుతారు. కానీ వాటిని నిలువరించి లొంగదీసుకుంటారు. కానీ ఈ సారి జల్లికట్టులో అభిమానులు జూనియర్ ఫొటోలను పెట్టి గిత్తలను అలంకరించారు. జూనియర్ ఎన్టీఆర్ పౌరుషం, పోట్ల గిత్తలతో చూసుకొని ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడ్డారు.

ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో సంప్రదాయబద్దంగా జరిగే జల్లికట్టును చూడడం కోసం చాలా మంది యువత అనుప్పల్లికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలను సైతం పక్కనపెట్టి ప్రజలు ఈ వేడుకలలో పాల్గొన్నారు.