Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాకిచ్చిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   26 Feb 2021 4:00 PM GMT
చంద్రబాబుకు షాకిచ్చిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్
X
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో బిజీగా ఉన్నారు. శుక్రవారం చంద్రబాబు శాంతిపురం వద్ద రోడ్ షో నిర్వహించారు, ఆ సమయంలో ప్రజల నుండి అనూహ్యమైన ప్రశ్నలు బాబుకు ఎదురయ్యాయి. కొందరు టిడిపి కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ గురించి చంద్రబాబును అడిగారు. "జూనియర్ ఎన్టీఆర్ ని తప్పకుండ తీసుకురావాలి సర్" అని చంద్రబాబు కాన్వాయ్ కు దగ్గర ఉన్న టిడిపి కార్యకర్త అరవడం వీడియోల్లో రికార్డ్ అయ్యింది.

విశేషం ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ మాట అన్న కార్యకర్త ఏమి చెబుతున్నాడో స్పష్టంగా విన్నాడు. అతడి వాదనను ఆమోదంతో అంగీకరించడం విశేషం..

కొంతమంది ఔత్సాహికులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను చంద్రబాబు రాక సందర్బంగా ఏర్పాటు చేసిన రోడ్‌షోలో బ్యానర్లుగా ఏర్పాటు చేసి అధినేతకు షాక్ ఇచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడడం.. చంద్రబాబు వయోభారం.. లోకేష్ నాయకత్వ లోపాలతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ గట్టెక్కుతుందన్న వాదనను తెలుగు తమ్ముళ్లు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది టిడిపిలో కొత్త విషయం కాదు.. పార్టీ కేడర్ అభిప్రాయంగా ఉంది.. ప్రతిసారీ టిడిపి కేడర్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ స్థితిని మార్చగలరని నమ్ముతున్నారు. కేడర్ యొక్క ఒత్తిడి ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవాలనే ఈ డిమాండ్ ను ఎప్పుడూ పెడచెవిన పెడుతూనే ఉన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం పూర్తిగా సినిమాల్లోనే బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడికి రాజకీయాలపై ఆసక్తి లేదు. కానీ టిడిపి కేడర్.. ముఖ్యంగా యంగ్ టైగర్ అభిమానులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా టిడిపిని రక్షించటానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారనే ఆశతో ఉన్నారు.