Begin typing your search above and press return to search.

జూనియర్ రానంత వరకే లోకేశ్ సేఫ్ ! అవును నిజం !

By:  Tupaki Desk   |   27 Feb 2022 5:30 AM GMT
జూనియర్ రానంత వరకే లోకేశ్ సేఫ్ ! అవును నిజం !
X
టీడీపీ విప‌క్ష హోదాలో ఉన్నా కూడా ప‌వ‌ర్ఫుల్ గా ప‌నిచేయ‌వ‌చ్చు.కానీ లోకేశ్ యాక్టివ్ కావ‌డం లేదు.అదేవిధంగా ఓ స్టార్ క్యాంపైన‌ర్ కోస‌మే వెతుకుతున్నారు త‌ప్ప‌! పార్టీ నుంచి కొంద‌రు నాయ‌కుల‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డ‌డం లేదు. చిన‌బాబు లోకేశ్ కు ఇంకా పార్టీపై ప‌ట్టు రావ‌డం లేదు.ఆయ‌న అనుకున్న విధంగా సాధించిందేమీ లేదు.

దీంతో పార్టీ ప్రాభ‌వం త‌గ్గిపోతోంది. కొన్ని చోట్ల అధికార పార్టీ హ‌వా ద‌గ్గ‌ర తేలిపోతోంది.ఈ క్ర‌మంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే లోకేశ్ బాబు సైడ్ అవ్వాల్సిందే! ఎందుకంటే ఎన్టీఆర్ వ‌చ్చాక పార్టీలో జ‌రిగే మార్పులు అన్నీ ఆయ‌న చుట్టూనే తిరుగుతాయి.ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోకి వెళ్లిన నాయ‌కులు కూడా వెనుక‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఎంద‌రో!ఇవ‌న్నీ లోకేశ్ కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు.అందుకే ఆయ‌న ప్ర‌భావం పార్టీపై ఎక్కువ‌గా ఉంటుంది అని అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.

తెలుగుదేశం పార్టీకి ఒక‌ప్పుడు స్టార్ క్యాంపైన‌ర్ గా ఉన్న తార‌క్ ఎందుక‌నో ఒక్క‌సారి ఆ పార్టీకి దూరం అయిపోయాడు.మిత్రులు, శ్రేయోభిలాషులు అయిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీలోనే ఉండిపోవ‌డంతో వారికి ఎదురువెళ్ల‌లేక అదేస‌మ‌యంలో వైసీపీపై పోరు చేయ‌లేక తార‌క్ సైలెంట్ అయిపోతున్నారు.

ఒక‌వేళ తార‌క్ క‌నుక రాజ‌కీయాల్లోకి వ‌స్తే పార్టీ ప‌గ్గాలు ఆయ‌న‌కు అప్ప‌గించరు. అప్పుడు కూడా చంద్ర‌బాబే అన్నీతానై న‌డిపిస్తారు అన్న‌ది వాస్త‌వం.క‌నుక చంద్ర‌బాబు చెప్పిన విధంగా కేవ‌లం ప్ర‌చారానికి వ‌చ్చి త‌న‌ని తాను ఆ విధంగా ప్రొజెక్టు చేసుకోవ‌డం తార‌క్ కు ఇష్టం లేని ప‌ని అని తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంలో ఈ నేప‌థ్యంలో టీడీపీ అంతర్గ‌త రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను తీర్చిదిద్ద‌డంలో చాలా వీక్ గా ఉంటోంది.ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఎదురించ‌డంలో ఇంకా వీక్ గా ఉంటోంది.వైసీపీ దూకుడు ను ఎక్క‌డా ఆప‌లేక‌పోతోంది.కొన్ని నిర్ణ‌యాలు ఎలా ఉన్నా స‌రే వైసీపీ అమలు చేస్తోంది.తీరా ఫ‌లితం బాగుండ‌క‌పోతే వెన‌క్కు తీసుకుంటోంది.

కొన్నిసార్లు కోర్టుల జోక్యంతో కూడా కొంత మేర‌కు ప్ర‌భుత్వ విధివిధానాలు మెరుగ‌వుతున్నాయి.కొన్ని సార్లు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆందోళ‌న‌ల కార‌ణంగా కూడా వైసీపీ స‌ర్కారు ఇంకాస్త మెరుగైన నిర్ణ‌యాలు తీసుకుంటోంది.ఆవిధంగా టీడీపీ క‌న్నా వైసీపీ కొన్ని విష‌యాల్లో,ముఖ్యంగా పాల‌న సంబంధ విష‌యాల్లో బాగుంది.ఆ రోజు చంద్ర‌బాబు స‌ర్కారు క‌న్నా ఇవాళ వైసీపీ స‌ర్కారు బాగుంది.

ఇదే స‌మ‌యంలో టీడీపీ వెనుక‌బ‌డిపోతోంది.ప్ర‌జా పోరాటాలు చేయ‌ద‌గ్గ స్థాయిలో ఇష్యూస్ ఏమీ లేవు.ప‌థ‌కాల అమ‌లు వాటి తీరుతెన్నుల‌పై ప్రెస్మీట్లు పెట్టి చెప్పినా వాటి ఊసు పెద్ద‌గా ఎవ్వ‌రికీ ప‌ట్ట‌దు.అందుకే టీడీపీ వ్య‌క్తిగ‌త రాజ‌కీయాల్లోకి పోతోంది.అయినా కూడా స‌క్సెస్ కాలేకపోతోంది.రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని తారక్ ను సీన్లోకి తెస్తే ఆయ‌న చంద్ర‌బాబు స్క్రిప్ట్ చ‌దివి వినిపించ‌డు గాక వినిపించ‌డు.

అంతేకాదు తార‌క్ ఎంట్రీలో లోకేశ్ సైడ్ అవ్వాల్సి ఉంటుంది.ఈ రెండూ ఇప్ప‌టికైతే జ‌ర‌గ‌వేమో! ఎందుకంటే పార్టీపై ప‌ట్టును లోకేశ్ రోజురోజుకూ పెంచుకోవాలి అని భావిస్తాడే కానీ త‌గ్గించుకోడు అలానే ప‌క్క‌కు తొల‌గిపోడు.

ఇదే సంద‌ర్భంలో లోకేశ్ ఉన్నాడు క‌నుక అధినాయ‌క‌త్వ ధోర‌ణి అంతా ఆయ‌న‌కు అనుకూలంగా ఉంటుంది క‌నుక తార‌క్ ను పిల‌వరు.పిలిచినా ప్ర‌చార ప‌గ్గాలు అప్ప‌గించి త‌రువాత ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం మానేస్తారు అన్న వాద‌న కూడా ఒక‌టి పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ నుంచి వ‌స్తోంది.అదే నిజం అయితే తార‌క్ ఎంట్రీ రాబోవు ఎన్నిక‌ల్లో లేద‌నే భావించాలి.