Begin typing your search above and press return to search.
ఉచితాలు మీకొద్దు.. మాక్కావాలి.. ఇదీ కమలదళం వ్యూహం!!
By: Tupaki Desk | 15 Feb 2023 7:00 PM GMTదేశంలో ఉచితాలు ఇచ్చే రాజకీయ పార్టీలతో ప్రయోజనం లేదని.. ఉచితాలు ఉచితాలు అంటూ.. ప్రజలను మోసం చేస్తున్నారని.. దీనివల్ల రాష్ట్రాలు అప్పట్లో మునిగిపోతున్నాయని.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులోనే కన్నీరు పెట్టుకున్నంత పనిచేసిన విషయం ఇంకా ప్రజల దృష్టి నుంచి కనుమరుగు కాలేదు. అయితే.. ఈ నీతులన్నా.. కూడా పక్కవారికి చెప్పేందుకేనని.. తమకు ఏమాత్రం వర్తించని.. నిరూపించారు బీజేపీ నాయకులు.
ఈ నెలలో జరగనున్న మూడు ఈశాన్యరాష్ట్రాల ఎన్నికల్లో రెండు చేతుల నిండా ఉచిత హామీలు ప్రకటించేశారు. మొన్నటికి మొన్న త్రిపుర రాష్ట్రంలో ఏకంగా బీజేపీ కీలక నేత.. కేంద్ర మంత్రి అమిత్ షానే.. ఉచితాలు ప్రకటించారు. కాలేజీ చదువుకునే విద్యార్థులకు అందరికీ.. గుండుగుత్తగా స్కూటీలు బహుమతిగా ఇస్తామన్నారు. ప్రతి గృహిణీకి సెల్ ఫోన్‌ను ఉచితంగా ఇస్తామన్నారు. అదేసమయంలో ప్రతి ఇంటికీ 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 31 స్థానాలను గెలుచుకున్న పార్టీ అధికారం చేపట్టనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రిపురలో ఈసారి ముక్కోణపు పోటీ నెలకొంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అధికార బీజేపీ- IPAFT కూటమి తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి కృషి చేస్తున్నాయి. ఒకప్పటి ప్రత్యర్థులైన సీపీఎం-కాంగ్రెస్‌లు ఈసారి కలిసి పోటీ చేస్తుండడం విశేషం.
ఇక, ఇప్పుడు మేఘాలయ విషయానికి వస్తే.. ఇది మరో ఈశాన్య రాష్ట్రం. ఇక్కడ కూడా ఈ నెల 27న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 60 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విడుదల చేశారు. అయితే.. ఈ మేనిఫెస్టోనూ ఉచిత హామీలు గంపలుగంపలుగా గుమ్మరించేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫారసులను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా సమయానికి ఉద్యోగులకు వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సంప్రదాయ వ్యవసాయానికి పెద్దపీట వేయనున్నట్టు చెప్పారు. రైతులకు అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధిని.. ఏడాదికి 6 వేల రూపాయలకు పెంచుతామన్నారు.
మహిళా, శిశు సంక్షేమానికి, వారి సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు నడ్డా చెప్పారు. ఈ క్రమంలో అప్పుడే పుట్టిన బాలికల పేరుతో 50 వేల రూపాయల బాండ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అదేవిధంగా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించనున్నట్టు చెప్పారు. మహిళలకు ప్రతి నెలా రూ.2000 చొప్పున సాయం అందిస్తామన్నారు. పింఛన్లను రూ.2000లకు పెంచుతామని చెప్పారు. మరి ఈ పరిణామాలను గమనిస్తే.. ఉచితాలపై పోరు చేస్తున్న బీజేపీవి నేతిబీర మాటలేనా? అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.