Begin typing your search above and press return to search.
తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసిన ఆ మహిళా జర్నలిస్టు ఎక్కడుందంటే?
By: Tupaki Desk | 1 Sep 2021 8:30 AM GMTఅశ్రఫ్ గనీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తమ వశం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. ఆగస్టు 15 నాడు తాలిబన్లు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్ కీలక నేతను టోలో న్యూస్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ చానల్‌లో పని చేస్తున్న సీనియర్ మహిళా జర్నలిస్టు యాంకర్ బెహెస్తా ఆర్ఘాండ్ కొందరు తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసింది. కాబుల్‌లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? తాలిబన్ల భవిష్యత్ ప్రణాళికలు, కార్యచరణ, మహిళలకు రక్షణ తదితర విషయాలపై బెహెస్తా తాలిబన్ నేతను క్వశ్చన్స్ అడిగింది.
ఆమె ప్రశ్నలకుగాను తాలిబన్ నేతలు సమాధానాలు కూడా ఇచ్చారు. ఇక ఇంటర్వ్యూ పూర్తయి ప్రసారం కూడా అయింది. కానీ, ఆ మహిళా జర్నలిస్టు కూడా కనబడకుండా పోయింది. దాంతో తాలిబన్లు ఆమెను ఏం చేశారు? అనే ప్రశ్న కూడా తలెత్తింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. సదరు మహిళా జర్నలిస్టు ఆప్ఘనిస్తాన్ దేశం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. మహిళలకు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రక్షణ లేదని గ్రహించే ఆమె అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే, తాలిబన్లు చెప్పిన మాటపై నిలబడతారనే గ్యారెంటీ లేదని, అందుకే తాను దేశం విడిచి వెళ్లినట్లు బెహెస్తా పేర్కొంది.
ఇచ్చిన మాటపై నిలబడి తాలిబన్లు మహిళలకు గౌరవమిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తే తాను తప్పకుండా తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌కు వస్తానని చెప్పింది. అయితే, ఆప్ఘనిస్తాన్ దేశంలో మళ్లీ మునుపటి పరిస్థితులు వచ్చే చాన్సెస్ కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని ప్రజలు భయాందోళనల మధ్య తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బయటకు రావాలంటే చాలు.. మహిళలు భయపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంటే ఇక.. వారు తమ పనులు ఎలా చేసుకోగలరో ఊహించుకోవచ్చు. ఇకపోతే ఆప్ఘనిస్తాన్ దేశంలో దాదాపుగా సెలబ్రిటీలు, ప్రముఖులు దేశం విడిచి వెళ్లిపోయారని చెప్పొచ్చు.
ఆ దేశ తొలి మహిళా, ముస్లిమేతర ఎంపీ ఆప్ఘన్ నుంచి పారిపోయి వచ్చి ఇండియా క్యాపిటల్ న్యూ ఢిల్లీలో తలదాచుకుంది. తన దేశ పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతుందని ఎమోషనల్ అవుతోంది. మాతృభూమి నుంచి పిడికెడు మట్టి కూడా తెచ్చుకోలేకపోయానని ఆమె బాధపడుతోంది. దేశంలోని సెలబ్రిటీలు సైతం విదేశాలకు ఎప్పుడో వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఉన్న జనం కాస్తా ఆందోళనకర పరిస్థితులతో ప్రాణాలతో బతికున్నారు అంతే.. ఆప్ఘన్ దేశంలో తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేందుకు పూనుకున్నందుకుగాను విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే ముగ్గురు పౌరులు చనిపోయారు కూడా.
మొత్తంగా నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు ఆప్ఘన్ తాలిబన్లు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆప్ఘనిస్తాన్ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఆప్ఘన్ దేశ పరిస్థితిపై పరిశీలన చేస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దేశంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు వస్తాయని తాము కలలో కూడా ఊహించలేదని ఆప్ఘన్ దేశ సెలబ్రిటీలు పేర్కొంటుడటం గమనార్హం. ఇక కొంత మంది అయితే అమెరికా వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని విమర్శలు చేస్తున్నారు.