Begin typing your search above and press return to search.

పౌర‌స‌త్వ‌ బిల్లు పై చిరంజీవి.. మ‌హేష్ స్పందించ‌రా?

By:  Tupaki Desk   |   28 Dec 2019 3:53 PM IST
పౌర‌స‌త్వ‌ బిల్లు పై చిరంజీవి.. మ‌హేష్ స్పందించ‌రా?
X
దాదాపు 70వేల మంది రోహింగ్యాలు అక్ర‌మం గా హైద‌రాబాద్ లో ప్ర‌వేశించారు. ఎవ‌రి వ‌ల్ల ఏ ముప్పు పొంచి ఉందో తెలీదు. పాన్.. ఆధార్.. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఒక‌టేమిటి.. భార‌తీయు లే అయినా వాళ్ల‌కు ఇన్ని లేవేమో! ఇలాంటి వాళ్ల‌ను దేశం నుంచి త‌రిమేసే పౌరసత్వ సవరణ బిల్లు ను ప్ర‌ధాని మోదీ- షా బృందం తెస్తే విమ‌ర్శిస్తారా? దీనిపైనే కాదు.. ప్ర‌తిసారీ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడి చేస్తూనే ఉన్నాయి. అయినా వాళ్లు బ‌య‌ప‌డ‌రు. జీఎస్టీ- నోట్ల ర‌ద్దు స‌హా ఎన్నో క‌ఠిన నిర్ణ‌యాలు ప్ర‌ధాని మోదీ తీసుకున్నారు. సిటిజ‌న్ షిప్ .. ఎన్.ఆర్.సి బిల్లుల విష‌యం లోనూ మోదీ వెన‌క్కి త‌గ్గ‌రు. ఇక ఆయ‌న‌ కు స‌పోర్ట్ చేస్తూ .. సిటిజ‌న్ షిప్ ఎమెండ్ మెంట్ చ‌ట్టం త‌ప్పు అన్న‌వాళ్లు దేశ‌ ద్రోహి అని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అన‌డం.. అండ‌గా నిల‌వ‌డం చూస్తుంటే హ్యాట్సాఫ్ చెప్పాల‌నిపించింద‌ని అన్నారు జ‌ర్న‌లిస్ట్ శ్వేతా రెడ్డి.

దేశ‌ద్రోహులు .. తీవ్ర‌వాదులు మాత్ర‌మే ప్ర‌ధాని తెచ్చిన చ‌ట్టాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై అల్ల‌ర్లు చెల‌రేగుతున్న వేళ సూప‌ర్ స్టార్ ఇనిషియేష‌న్ కి శ‌హ‌భాష్ అని ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాదు.. ర‌జ‌నీలా టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఎవ‌రూ స్పందించ‌డం లేదేమిటి? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మహేష్ -చిరంజీవి లను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు వివాదాస్పద జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి.

చిరంజీవి .. మహేష్ ఈ బిల్లుపై మాట్లాడ‌క‌పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. స్వాతంత్య్ర‌ దినోత్సవానికి.. గణతంత్ర దినోత్సవానికి జేబుకు జాతీయ జెండాను తగిలించుకుని ఫోటోలు దిగ‌డం కాదు కావాల్సింది. సోషల్ మీడియాలో విషెస్ చెప్పడం అస‌లే కాదు. ఇలాంటి సమయాల్లో స్పందించాలి. రజినీకాంతే అసలైన సూపర్‌స్టార్.. మీరేవ‌రూ కానేకాదు.. అంటూ హాట్ కామెంట్స్ చేశారు.