Begin typing your search above and press return to search.
నడిరోడ్డు మీద జర్నలిస్టుపై కాల్పులు.. కారణం తెలిస్తే షాకే
By: Tupaki Desk | 21 July 2020 7:15 AM GMTదారుణమైన నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాష్ట్రాల్లో బిహార్ ముందుంటే.. తర్వాతి స్థానం ఉత్తరప్రదేశ్ దే. ఇటీవల కాలంలో సీన్ కాస్త రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో దారుణ నేరాల విషయంలో ఉత్తరప్రదేశ్ పేరు తరచూ వార్తల్లోకి వస్తోంది. ఈ మధ్యనే గ్యాంగస్టర్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళితే.. వారిపైకాల్పులు జరిపి ఎనిమిది మందిని బలి తీసుకోవటం.. తర్వాత పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించటం తెలిసిందే. ఈ ఘటనను మర్చిపోక ముందే తాజాగా యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది.
తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో ఒక జర్నలిస్టుపై నడి రోడ్డు మీదనే కాల్పులుజరిపారు దుండగులు. దీనికి కారణం ఏమిటో తెలుసా? సదరు జర్నలిస్టు మేనకోడలి పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆవేదన చెందిన మేనకోడల్ని సముదాయిస్తూ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాడు జర్నలిస్టు విక్రమ్ జోషి. అంతే.. సదరు జర్నలిస్టుపై నడిరోడ్డు మీదనే కాల్చి చంపేసిన వైనం సంచలనంగా మారింది.
ఘజియాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. విక్రమ్ జోషి జర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన మేనకోడలిని ఇటీవల కాలంలో కొందరు అదే పనిగా వేధిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి తన కుమార్తెతో కలిసి విక్రమ్ జోషి ఇంటికి వెళుతుండగా.. దుండగులు అతనిపై దాడి చశారు. అనంతరం అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు.
ఈ ఘటన గురించి సమాచారం తెలిసింతనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తలలో బులెట్ దిగబడటంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. తన మేనకోడల్ని వేధించిన వారిపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. దాడికి సంబంధించిన సన్నివేశాలు సీసీ కెమేరాలో నమోదయ్యాయి. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటివరకూ ఎవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఒక జర్నలిస్టుపై నడిరోడ్డు మీద కాల్పులు జరిపిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. మరీ.. ఉదంతంపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.