Begin typing your search above and press return to search.
నువ్వు అనుకుంటే అవ్వుద్ది సామీ అంటున్న ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 24 Jan 2020 5:32 AM GMTఆంధప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా రాజకీయం మంచి రసపట్టులో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన ఏపీ సర్కార్ ..ఆ బిల్లుకి ఆమోదం తెలపడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే... ఆ బిల్లుని మండలిలో ఆమోదం కాకుండా అడ్డుపడి టీడీపీ తన సత్తా ఏంటో చూపించడంతో వైసీపీ నేతలు టీడీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యే లు తమ చమత్కారం తో ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక సభలో మరోసారి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని బిల్లుని ప్రవేశపెట్టడంతో దాని పై చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏదైనా చేసి తీరుతారని అన్నారు. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామీ.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం' అంటూ ఎమ్మెల్యే పద్మావతి మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా డైలాగ్ చెబుతూ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పేద - మధ్య తరగతి కుటుంబాల్లో సీఎం వెలుగులు నింపుతున్నారని ఆమె చెప్పారు. ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు రాదనడం సరికాదని అంటూ మండిపడ్డారు.
అలాగే ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డ్రామాలు ‘నెవర్ బిఫోర్..నెవర్ ఆప్టర్' అంటూ సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరూ లోని డైలాగ్ చెప్పడం విశేషం. చంద్రబాబునాయుడు నారా లోకేష్ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు - ఇంగ్లీష్ రెండూ రావడం లేదని సెటైర్లు వేశారు. కాగా, ఏపీ విద్యా చట్టం సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిలో ప్రతిపాదించిన సవరణలు అసెంబ్లీలో వీగిపోయాయి.