Begin typing your search above and press return to search.

కొత్త మంత్రుల్లో ఆమెకు బెర్త్ ఖాయ‌మేనా...?

By:  Tupaki Desk   |   28 Sep 2021 1:30 AM GMT
కొత్త మంత్రుల్లో ఆమెకు బెర్త్ ఖాయ‌మేనా...?
X
త్వ‌ర‌లోనే కొత్త మంత్రుల‌ను తీసుకుంటున్నార‌నే వార్త‌.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల్లో ఉత్సాహం నింపింది. అదే స‌మ‌యంలో ఔత్సాహిక నేత‌లు త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేసుకుంటున్నారు. అయితే.. ఎవ‌రికి ఏది ద‌క్కుతుంది? ఏ జిల్లాకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో అనంత‌పురం జిల్లాకు చెందిన ఓ మ‌హిళా నేత‌కు ఖ‌చ్చితంగా సీటు ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం జిల్లాలోనే కాకుండా.. వైసీపీ సీనియ‌ర్ల మ‌ధ్య కూడా చ‌ర్చ సాగుతోంది. జిల్లాలోని శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన జొన్న‌లగ‌డ్డ ప‌ద్మావ‌తికి సీటు ద‌క్కుతుంద‌ని అంటున్నారు. ఎస్సీ సామాజిక వ‌ర్గం మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌ద్మావ‌తి.. అన్ని విధాలా బెర్త్‌కు స‌రైన నాయ‌కురాల‌ని కూడా అంటున్నారు.

ప‌ద్మావ‌తి విష‌యానికి వ‌స్తే.. 2014లో ఓసారి ఓడిపోయారు. అయినా కూడా ప‌ట్టు వ‌ద‌ల కుండా పార్టీని బ‌లోపేతం చేశారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో.. అనూహ్యంగా ఆమెకు అన్నీ క‌లిసి వ‌చ్చాయి. టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు. కీల‌క నేత‌లు ఎవ‌రికి వారు పోరుకు త‌ల‌ప‌డ‌డం.. వంటివి టీడీపీ ఓటు బ్యాంకును బాగా చీల్చాయి. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర సునామీ.. కూడా క‌లిసి వ‌చ్చింది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో.. కాంగ్రెస్ బ‌లంగా లేక పోవ‌డం కూడా ప‌ద్మావ‌తికి క‌లిసి వ‌చ్చి.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతేకాదు.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాలమాదిరిగా.. త‌ను ఇంటికే ప‌రిమితం కాకుండా. క‌రోనా స‌మ‌యంలో విశేష సేవ‌లు అందించారు. దీనికి రాష్ట్ర‌ప‌తి నుంచి కూడా ఆమె అవార్డును అందుకున్నారు.

అదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి క‌రోనా నియంత్ర‌ణ‌లోనూ కృషి చేశారు. త‌న‌కు ప‌ద‌వి ఉందా లేదా.. అని చూసుకోకుం డా.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ నేత‌ల్లో ఆమె ముందున్నార‌నేది వాస్త‌వం. ఇక‌, రాజ‌కీయంగా చూసుకున్నా.. త‌ను ఎమ్మెల్యే అయిన వెంటనే టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె .. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయ‌కురాలు.. యామినీ బాల‌ను వైసీపీలో చేర్చారు. దీంతో ఎమ్మెల్యేకు ప్ర‌తిప‌క్షం ర‌గ‌డ లేదు. పైగా టీడీపీలోనే టికెట్ పోరు ఎక్కువైంది.

దీంతో ఎమ్మెల్యే అభివృద్ధి ప‌నుల్లోనూ.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డంలోనూ పార్టీని బ‌లోపేతం చేయ‌డంలోనూ మంచి మార్కులు సంపాయించుకున్నారు. ఇక‌, ఎలాగూ రిజ‌ర్వేష‌న్ క‌లిసి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో జొన్న‌ల‌గ‌డ్డ‌కు ప‌ద‌వి ఖాయ‌మ‌నే అంచ‌నాలు పుంజుకున్నాయి. పైగా ఆమె భ‌ర్త సాంబ‌శివా రెడ్డి రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం కూడా ఈక్వేష‌న్లు ఆమెకు క‌లిసి రానున్నాయి. వైఎస్ అభిమానిగా.. జ‌గ‌న్‌కు మ‌రింత అభిమానిగా పేరున్న ప‌ద్మావతికి బెర్త్ ఖాయం చేస్తార‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.