Begin typing your search above and press return to search.
జేసీ ట్రావెల్స్ కు షాక్: రూ.వంద కోట్ల జరిమానా
By: Tupaki Desk | 8 Feb 2020 9:42 AM GMTతప్పుడు పత్రాలు - నిబంధనలు ఉల్లంఘించి కొనసాగుతున్న జేసీ ట్రావెల్స్ కు పెద్ద షాక్ తగలనుంది. త్వరలోనే ఈ సంస్థకు సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ ట్రావెల్స్ పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో జేసీ ట్రావెల్స్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరినట్లు ఆ అధికారులు ప్రకటించారు. ఈ విషయాలను విజయవాడలో శనివారం ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు మీడియా సమావేశంలో వెల్లడించారు.
2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలు మాత్రమే విక్రయించాలనే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే దీనికి విరుద్ధంగా ఏపీలోని అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్-3 వాహనాలు గుర్తించినట్లు ప్రకటించారు. అయితే వీటిని స్క్రాబ్ కింద విక్రయించామని అశోక్ లేలాండ్ కంపెనీ తమకు వివరాలు పంపిందని వెల్లడించారు. ఆ వాహనాలు బీఎస్ 3 ఉండగా నాగాలాండ్‌లో బీఎస్-4గా మార్చేసి రాష్ట్రంలో తిప్పుతున్నారు. వీటిలో ఆరు వాహనాలు జేసీ దివాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఒక వాహనం జేసీ ట్రావెల్స్ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట - మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరిట రిజిస్టరై ఉన్నట్లు వెల్లడించారు.
అయితే దీనిపై అనంతపురము వన్ టౌన్ పీఎస్ లో జేసీపై ఫిర్యాదు అందడంతో దానిపై విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న జేసీ ట్రావెల్స్ పై విచారణ చేయాలని ఫిర్యాదుదారుడు పేర్కొనడంతో తాము విచారిస్తున్నట్లు తెలిపారు. పర్మిట్లు లేని వ్యవహారంతోపాటు - ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీతో జేసీ బ్రదర్స్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజా ఫిర్యాదుతో రవాణాశాఖ ఉన్నతాధికారులు జేసీ ట్రావెల్స్ అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.