Begin typing your search above and press return to search.
ఉద్యోగాలపై గుడ్ న్యూస్, డీట్‌తో నేరుగా ప్రయివేటు కంపెనీల్లో భర్తీ
By: Tupaki Desk | 12 Aug 2020 12:30 AM GMTప్రయివేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై తెంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం గత ఏడాది తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ వెబ్ సైట్ www.tsdeet.com సహకారంతో ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటోంది. చాలామంది నిరుద్యోగులు దీని ద్వారా నమోదు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8 లక్షలకు పైగా నిరుద్యోగులు ఇందులో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంఖ్య ఇప్పుడు 7.25 లక్షలకు పైగా ఉన్నట్లు కార్మిక ఉపాధి శాఖ జాయింట్ డైరెక్టర్ నీరజ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సంఖ్య ఆధారంగా నిరుద్యోగుల సంఖ్య తగ్గిందని చెప్పలేమని కూడా అన్నారు. కరోనా కారణంగా చాలామంది పునరుద్ధరించి ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.
టీఎస్-డీట్ సాయంతో ఇక్కడ దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు ఎవరైనా ఇందులో నమోదు కావొచ్చు. విద్యార్హత ప్రమాణాలు ఏమీ లేవు. టీఎస్-డీట్‌లో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అండర్ స్కిల్డ్‌తో పాటు నిరుద్యోగం, తగిన ఉద్యోగం లేకపోవడం లేదా ఇతర ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి మొత్తం ఆరు కేటగిరీలు ఉన్నాయి. ఆయా కేటగిరీలకు సంబంధించి ఖాళీలను గుర్తించి సమాచారం అందిస్తారు.
ఇదివరకు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ జాబ్ మేళా నిర్వహించింది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకుంది. టీఎస్-డీట్ సాయంతో ప్రయివేటు రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. డీట్ యాప్ కూడా అందుబాటులో ఉంది. ఏడాది కాలంలో టీఎస్-డీట్ ద్వారా దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ జరిగాయట. లక్షకు పైగా ప్రయివేటు సంస్థలు డీట్‌లో నమోదయ్యాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఇక్కడా కనిపించింది. ఉద్యోగం కోసం వెతికేవారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే భారత జాబ్ మార్కెట్ కోలుకుంటోంది.