సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు ఏపీ ప్రభుత్వం వెళ్లింది.
జీవో 35ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదన లను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
అంతేకాదు.. ముందు మేం చెప్పిన ఆదేశాలను పాటించడం .. ప్రభుత్వ కర్తవ్యం. మేం చెప్పినట్టు.. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదే శించింది.
అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సర్కారుకు ఎలాంటి ఊరట లభించలేదు. పైగా.. ప్రభుత్వ ప్రమేయం ఉండరాదంటూ.. జాయింట్ కలెక్టర్లకు విషయాన్ని అప్పగించింది. దీంతో ఇప్పుడు సర్కారు.. జేసీలపై ఒత్తిడిపెంచుతుందనే వాదన వినిపిస్తోంది.
తాము చెప్పినట్టు జేసీలు నడిచేలా అంతర్గత మౌఖిక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని.. విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. జేసీలు కనుక న్యాయ పరిధి దాటి వ్యవహరిస్తే.. వారు చిక్కుల్లో పడడం ఖాయమని చెబుతున్నారు.
ఎందుకంటే.. గతంలోనూ ఇలానే హైకోర్టు చెప్పిన ఆదేశాలు పట్టించుకోని అధికారులను కోర్టు పిలిచి మరీ .. వార్నింగులు ఇచ్చింది. మరి ఇప్పుడు కోర్టు ఆదేశాలల మేరకు సినిమాటికెట్లపై .. జేసీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. లేక ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతారో చూడాలి.