Begin typing your search above and press return to search.

జనసేనలో చేరేందుకు వారు సిద్దం: ముహూర్తం ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   27 Feb 2022 11:30 AM GMT
జనసేనలో చేరేందుకు వారు సిద్దం: ముహూర్తం ఎప్పుడంటే..?
X
సినిమాల్లో ఇప్పటికే సక్సెస్ హీరో అనిపించుకున్న పవన్ రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నాడు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించేందుకు యత్నిస్తున్నాడు. కొన్ని నెలలుగా మిగతా పార్టీల కంటే జనసేన వైపు వెళ్లాలని కొందరు అనుకుంటున్నారట.

వైసీపీలోని కిందిస్థాయి నేతలు, టీడీపీ, ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలంతా జనసేన వైపు చూస్తున్నారట. ఈ మేరకు జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే మార్చిలో జనసేన వార్షికోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభల్ చేరికలతో పాటు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో తేల్చనున్నారని చర్చించుకుంటున్నారు.

గత ఎన్నికల్లో రాజకీయాగా ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న పవన్ ఈసారి మాత్రం పకడ్బందీగా అగులు వేస్తున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రజలకు దగ్గరవుతున్నాడు. కొన్ని నెలలుగా ప్రజల్లో జనసేన పార్టీపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ప్రజా సమస్యలపై పవన్ నిరంతరాయంగా పోరాడడంతో ఆయనపై జనం నమ్మకం పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్ల విషయంలో పవన్ చేసిన పోరాటంపై వెల్లువలా ప్రశంసలు వచ్చాయి. అలాగే విశాఖ ఉక్కు కోసం పవన్ ప్రత్యేకంగా సభలు నిర్వహిస్తూ కేంద్రంపై పోరాడుతున్నాడు.

ఈనేపథ్యంలో ఇన్నాళ్లు బీజేపీ ఉన్న చెలిమిని కూడా కాదనుకున్నాడు. పవన్ అనుసరిస్తున్న విధానాలతో ఆ పార్టీలో చేరితే ప్రయోజనం ఉంటుందని మిగతా పార్టీల్లోని నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చర్చించుకుంటున్నారు.

ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటాం.. అనే గుడ్డి నమ్మకంతో కాకుండా ప్రజల్లో మంచి పేరున్న నాయకులతో పాటు పోరాడగలిగే శక్తి ఉన్నవాళ్లనే పార్టీలో చేర్చుకుంటామని నాదెండ్ల మనోహర్ తన సన్నిహితుల ద్వారా చర్చించారట.

ఇందులో భాగంగా ఆయన జిల్లాల వారీగా పార్టీలో చేరేవారి లిస్ట్ ను తయారు చేస్తున్నారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ పార్టీలో చేరుతామంటున్నారని సమాచారం.

అయితే ఇప్పటికే తమ ప్రాంతాలో పట్టును సాధించి ఉంటే అందుకు సంబంధించిన హామీ కూడా ఇస్తున్నారట. అయితే అధికారికంగా మాత్రం అప్పుడే పార్టలో చేర్చుకోవడం లేదని తెలుస్తోంది.

ఇక జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చిలో నిర్వహించనున్నారు. ఈ సభ జనసేన కు రాజకీయంగా ప్రత్యేకత కానుంది. ఈ సభలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామో తేల్చనున్నారని సమాచారం. మొన్నటి వరకు బీజేపీతో కలిసున్న జనసేన ప్రస్తుతం ఆ పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది.

టీడీపీతో మంతనాలు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ సినిమా భీమ్లానాయక్ రిలీజ్ సందర్భంగా చంద్రబాబుతో పాటు లోకేశ్ సైతం కామెంట్లు చేయడం చూస్తే పవన్ టీడీపీతో జత కట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో మార్చిలో నిర్వహించే సభలో ఇటు పొత్తులు.. అటు పార్టీలో చేరికల విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.