Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ ఉత్పత్తిలో చేయి కలపండి..భారత్ కు రష్యా విన్నపం

By:  Tupaki Desk   |   21 Aug 2020 4:00 AM GMT
వ్యాక్సిన్ ఉత్పత్తిలో చేయి కలపండి..భారత్ కు రష్యా విన్నపం
X
ప్రపంచంలోని ప్రతి దేశంలో కరోనా కేసులు తీవ్రతరం అయ్యాయి. వ్యాక్సిన్ ను సిద్ధం చేసేందుకు అన్ని దేశాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీలో జోరుగా ముందుకు సాగుతున్నాయి. కొన్ని దేశాల్లో ప్రస్తుతం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా.. మరి కొన్ని దేశాలు మూడో దశలో ట్రయల్స్ సాగిస్తున్నాయి. అమెరికా రష్యా, చైనా టీకా తయారీలో ముందంజలో ఉన్నాయి. రష్యా ఒకడుగు ముందుకేసి వ్యాక్సిన్ సిద్ధమైనట్లు ప్రకటించింది. త్వరలోనే మార్కెట్ లో కి తెస్తామని ప్రకటించింది. రష్యా అభివృద్ధి చేసిన టీకాకు 'స్పుత్నిక్ -వి ' అని పేరు పెట్టారు.

కాగా ఇంకా మార్కెట్ లోకి కూడా రాని ఈ వ్యాక్సిన్ ను కొనుగోలు కోసం ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాకు అడ్వాన్స్ గా బిలియన్ డాలర్ల డబ్బు ముట్టజెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ -వి ' ఉత్పత్తిలో భారత్ భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్టు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీ ఐ ఎఫ్ ) సీఈవో కిరిల్ దిమిత్రియేవ్ తెలిపారు. తాము అభివృద్ధి చేస్తున్న టీకా కరోనాను దీటుగా ఎదుర్కొంటుందని, స్థిరమైన రోగనిరోధక శక్తి ఏర్పరుస్తుందని వెల్లడించారు. ఇప్పటికే టీకా సిద్ధం అవడంతో భారీ మొత్తంలో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసి తమ దేశ ప్రజలకు అందజేయాలని రష్యా భావిస్తోంది. అదే సమయంలో భారత్ వంటి అతి పెద్ద ఉత్పత్తిదారును భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ఉత్పత్తులను ఇతర దేశాలకు వేగంగా విక్రయించడానికి అవకాశం ఉంటుందని ఆ దేశం భావిస్తోంది. అయితే రష్యా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోకుండానే వ్యాక్సిన్ విడుదలకు సిద్ధం అవుతోందని శాస్త్రవేత్తలు అనునిస్తున్నారు.