Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ పై జాన్సన్ సంచలన నిర్ణయం ..
By: Tupaki Desk | 3 Aug 2021 6:30 AM GMTజాన్సన్ అండ్ జాన్సన్’ కొవిడ్ టీకా తో భారత్ లో ప్రయోగ పరీక్షల నిర్వహణకు అనుమతులు కోరుతూ ఏప్రిల్ లో సమర్పించిన దరఖాస్తును అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సోమవారం వెనక్కి తీసుకుంది. విదేశాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న కొవిడ్ టీకాలకు ప్రయోగ పరీక్షలు అక్కర్లేకుండా నేరుగా అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేసేలా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కరోనావైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి కోసం భారత ప్రభుత్వానికి ఇప్పటికే చేసుకున్న దరఖాస్తును జాన్సన్ అండ్ జాన్సన్ ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు వివరాలను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) వెల్లడించింది. ఇండెమ్నిటీ (టీకా కారణంగా అనుకోని సమస్యలు తలెత్తిన సందర్భాల్లో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు న్యాయపరమైన చర్యలు నుంచి రక్షణ కల్పించే వ్యవస్థ) విషయంలో చట్టపరమైన చిక్కులను తొలగించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జాన్సన్ అండ్ జాన్సన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, వ్యాక్సిన్ అనుమతిపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని జాన్సన్ అండ్ జాన్సన్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
తమ వ్యాక్సిన్ కు సంబంధించి భారతదేశం లోనూ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనకు ముందే అమెరికాలో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. ఈ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకట్టొచ్చన్న అనుమానాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమెరికా ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా, మనదేశంలో ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ దేశీయ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా గత కొద్ది వారాలుగా ఇస్తున్నారు. బయోలాజికల్ ఈ అభివృద్ధి చేస్తున్న మరో దేశీయ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది.
ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో మొన్న 40,134 కరోనా కేసులు నమోదు కాగా, నిన్న 30,549 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 38,887 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,26,507కు చేరింది. మరణాల విషయానికొస్తే... నిన్న 422 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,25,195కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,08,96,354 మంది కోలుకున్నారు. 4,04,958 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 47,85,44,114 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 61,09,587 డోసులు వేశారు.