Begin typing your search above and press return to search.
మరోసారి క్లినికల్ ట్రయల్స్ కు బ్రేకులు.. కారణం ఏమిటంటే?
By: Tupaki Desk | 13 Oct 2020 7:30 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం దాదాపు వందకు పైగా ప్రయోగాలు సాగుతున్నాయి. ఇందులో ఐదారు సంస్థలు చేపట్టిన పరిశోధనలపై ప్రపంచం మొత్తం బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అలాంటి సంస్థల్లో ఒకటి జాన్సన్ అండ్ జాన్సన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బహుళజాతిసంస్థగా పేరున్న ఈ సంస్థ కరోనా క్లినికల్ ట్రయల్స్ 3దశలో ఉంది. తాజాగా తాము చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేసినట్లుగా సదరు కంపెనీ పేర్కొంది.
ఎందుకిలా జరిగిందన్న విషయంలోకి వెళితే.. క్లినికల్ ట్రయల్స్ లో పాలు పంచుకుంటున్న వారిలో ఒకరు అనారోగ్యానికి గురి కావటమేనని చెబుతున్నారు. ఒకరు అనారోగ్యానికి పాలు కావటం.. అందుకు కారణం ఏమై ఉంటుందన్న విషయంపై స్పష్టత వచ్చేవరకు క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయటం జరుగుతుందని చెబుతున్నారు.
సాధారణంగా క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎదురైన సవాళ్లను ఎప్పటికప్పుడు తేల్చేయటం.. మరింత లోతుగాఅధ్యయనం చేయటం.. ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దటం చేస్తుంటారు. ప్రస్తుతం జాన్సన్ అండ్ జాన్సన్ పరిస్థితి కూడా అలాంటిదేనని చెబుతున్నారు. మొత్తం 60 వేల మంది వలంటీర్లతో అధ్యయనాన్ని చేపట్టింది. అర్జెంటీనా.. బ్రెజిల్.. చిలీ..కొలంబియా.. మెక్సికో.. పెరూ దేశా్లో ఈ సంస్థ క్లినికల్ ట్రయల్స్ ను షురూచేసింది.