Begin typing your search above and press return to search.

గూగుల్ లో ఆంధ్రా ప‌ప్పు..ఆంధ్ర పులి అని సెర్చ్ చేస్తే..

By:  Tupaki Desk   |   2 May 2017 5:12 PM GMT
గూగుల్ లో ఆంధ్రా ప‌ప్పు..ఆంధ్ర పులి అని సెర్చ్ చేస్తే..
X
ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల‌పై ఓ రేంజ్ ఎట‌కారం ఆడారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత జోగి ర‌మేశ్‌. రైతుల‌కు మ‌ద్ద‌తుగా గుంటూరులో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన రైతు దీక్ష ముగింపు సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడిన మాట‌లు ఆద్యంత్యం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించాయి. ఆయ‌న చేసిన వ్యంగ్య వ్యాఖ్య‌ల ప్ర‌సంగం ఎలా సాగింద‌న్న‌ది ఆయ‌న మాట్ల‌లోనూ చూస్తే..

గూగుల్‌లో ఆంధ్ర పప్పు అని సెర్చ్ చేస్తే సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు లోకేవ్ పేరువ‌స్తుంద‌ని.. ఆంధ్ర పులి అని సెర్చ్ చేస్తే వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేరు వ‌స్తుంద‌న్నారు. పార్టీ నుంచి పారిపోయిన ఓ ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్ ఉంద‌ని చెబితే.. ఇంకో ఎమ్మెల్యే బీకాంలో సీఈసీ ఉందంటున్నారు.

బాబు త‌న‌యుడు ఏపీ మంత్రి లోకేవ్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ జ‌యంతి.. వ‌ర్థంతికి తేడా తేలీకుండా మాట్లాడారు. ఆంద్ర పప్పు అని లోకేశ్ అని తాను పేర్కొన్నందుకు త‌న‌పై దాడి చేశారు. తానీ మాట అన‌టం లేద‌ని గూగుల్ లోనే అలా వ‌స్తుంద‌ని.. లోకేశ్ గురించి గూగుల్ వాళ్ల‌కు ఎవ‌రు చెప్పారు?

ఆంధ్ర ప‌ప్పు అంటే లోకేశ్ అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లే చెప్పారు. ఆంధ్ర‌పులి అన్నా.. ఆంధ్రా నిప్పు అని అన్నా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా చంద్ర‌బాబును.. లోకేశ్‌ను చెమ‌డాలు వ‌లిచి కొట్టి ప్ర‌జ‌లు పంపాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/