Begin typing your search above and press return to search.

అమెరికన్ ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పిన జోబైడెన్

By:  Tupaki Desk   |   24 Jan 2021 5:46 AM GMT
అమెరికన్ ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పిన జోబైడెన్
X
నల్లధనం తీసుకొచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో వేల రూపాయలు వేస్తానని ఎన్నికల ముందర మన ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. ఆ నల్లధనం వచ్చిందో లేదో తెలియదు.. ఒక్కరి అకౌంట్లో కూడా రూపాయి నల్లధనం పడింది లేదు. కానీ ఏ హామీ ఇవ్వకుండానే అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ అమెరికన్లను ఆశ్చర్యపరిచాడు.

తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జోబైడెన్ అమెరికా ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పారు. ఒక్కో అమెరికా పౌరుడి ఖాతాలో 2వేల డాలర్లు (రూ.1,46000) జమ చేస్తున్నట్టు తెలిపారు.

అమెరికా రెస్క్యూ ప్లాన్ పేరుతో 1.90 లక్షల డాలర్ల ప్యాకేజీని జోబైడెన్ తాజాగా ప్రకటించారు. పౌరులకు 600 డాలర్లు సరిపోవని.. 2000 డాలర్లు ఇవ్వాలని బైడెన్ ఆదేశించారు. అమెరికన్ ప్రజలను ఆకలితో ఉండనీయమన్నారు. ఆర్థికంగా కృంగిపోయిన ఇతర రంగాలకు కూడా పెద్ద ఎత్తున ప్యాకేజీలు ప్రకటించడానికి రెడీ అయ్యారు.

ట్రంప్ అందించిన రూ.66 లక్షల కోట్ల ప్యాకేజీకి అదనంగా జోబైడెన్ ఇప్పుడు అమెరికన్ ప్రజలందరికీ ఈ ప్యాకేజీ ప్రకటించారు. ఈ పరిణామం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ఉంది. అమెరికాలో ప్యాకేజీ అంటే నేరుగా నగదు బదిలీనే.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి.. వ్యాపారాల్లో నష్టపోయిన వారికీ ఇలా అందరికీ ఉద్దీపన ప్యాకేజీల కింద బ్యాంకు అకౌంట్ల ద్వారా డబ్బులు అందిస్తారు.