Begin typing your search above and press return to search.
మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం..కన్నీళ్లు పెట్టుకున్న జో బైడెన్ - ఏమైందంటే?
By: Tupaki Desk | 20 Jan 2021 6:06 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో పండుగ వాతావరణం సంతరించుకొంది. మరికొన్ని గంటల్లో జో బైడెన్ 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. రాజధాని వాషింగ్టన్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని వాషింగ్టన్ లో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ప్రమాణ స్వీకారారినికి కొన్ని గంటల ముందు- జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ లింకన్ స్మారక స్థూపాన్ని సందర్శించారు. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారికి నివాళి అర్పించారు. బిడెన్ భార్య, అమెరికా కాబోయే ప్రథమ మహిళ జిల్ బిడెన్, కమలా హ్యారిస్ భర్త డగ్, ఎమ్హోప్ తో ఇందులో పాల్గొన్నారు.
ఇక నివాళి అర్పించే సమయంలో జో బిడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటితో ఆయన నివాళి అర్పించారు. ప్రతి అమెరికన్.. కరోనా మృతులను స్మరించుకుంటున్నారని - డెలావర్ లో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానని - డెలావర్ బిడ్డగా గర్విస్తున్నానని అన్నారు. అమెరికాలో కరోనా బారిన పడి ఇప్పటిదాకా 4,11,434 మంది మరణించారు. ఇప్పటివరకు 2,48,02,220 కేసులు నమోదు అయ్యాయి.జో బిడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని లింకన్ స్మారక స్థూపాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. నాలుగు లక్షల మందికి పైగా మరణించడానికి గుర్తుగా 400 దీపాలను ఈ స్మారక స్థూపానికి అమర్చారు
అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ కార్యాలయాలు - ఇతర ప్రధాన ప్రభుత్వ భవనాలు ప్రస్తుతం భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు. కేపిటల్ బిల్డింగ్ - సుప్రీంకోర్టు భవనాల వద్ద ఏడు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఇనుప బ్యారికేడ్లను అమర్చారు. రౌండ్ ద క్లాక్ విధానంలో సాయుధులైన సైనికులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఒక్క వాషింగ్టన్ లోనే 25 వేలమందికి పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరింపజేశారు. గతంలో సివిల్ వార్ నడుస్తోన్న సమయంలో అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటి రోజులు మళ్లీ వాషింగ్టన్ లో కనిపిస్తున్నాయి.