Begin typing your search above and press return to search.

సౌదీ దెబ్బకు గిలగిల్లాడిపోయిన బైడెన్

By:  Tupaki Desk   |   5 Aug 2022 6:46 AM GMT
సౌదీ దెబ్బకు గిలగిల్లాడిపోయిన బైడెన్
X
అదునుచూసి సౌదీ అరేబియా కొట్టిన దెబ్బకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గిలగిల్లాడిపోయారు. యమార్జంటుగా రక్షణదళాల ఉన్నతాధికారులతో సమావేశమై వెంటనే సౌదీ అరేబియా అడిగిన ఆయుధాలను పంపాలని ఆదేశించారు. ఇంతకీ విషయం ఏమిటంటే సౌదీలోని కీలక స్ధావరాలపై హైతీ అనే తీవ్రవాదుల గ్రూపు దాడులుచేస్తోంది. వాళ్ళనుండి రక్షణకోసం తమకు అవసరమైన ఆయుధాలను ఇవ్వాలని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడిని రిక్వెస్టుచేశారు. అయితే ఆ రిక్వెస్టును బైడెన్ అసలు పట్టించుకోలేదు.

సీన్ కట్ చేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు కష్టాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా అమెరికాలో కూడా ఇబ్బంది పెరిగిపోతోంది. చమురు ఇబ్బందులకు తోడు అనేక కారణాల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం 9 శాతం దాటిపోయింది.

చమురు దిగుమతులను పెంచుకోవాలని అనుకున్న అమెరికా వెంటనే సౌదీ అరెబియాను కోరింది. యుద్ధానికి ముందు వరకు అమెరికాకు చమురును పెద్దఎత్తున రష్యాయే ఎగుమతిచేసేది. యుద్ధం కారణంగా సాధ్యం కాదుకాబట్టే ఆ కొరతను సౌదీ ద్వారా భర్తీ చేసుకోవాలని బైడెన్ ఆలోచన.

అయితే బైడెన్ రిక్వెస్టును సౌదీ యువరాజు పక్కన పడేశారు. ఒకవైపు దేశంలో చమురు సంక్షోభం పెరిగిపోతోంది మరోవైపు ఎంత రిక్వెస్టు చేసినా సౌదీ పట్టించుకోవటంలేదు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్ధితిలో వెంటనే బైడెన్ సౌదీ యువరాజుతో మాట్లాడారు. సౌదీ అడిగనన్ని ఆయుధాలను వెంటనే పంపుతామని హామీ ఇచ్చారు.

తాజా హామీ ప్రకారం 5 బిలియన్ డాలర్ల విలువైన క్షిపణి రక్షణ వ్యవస్ధలు, 3 బిలియన్ డాలర్ల విలువైన పేట్రియాటిక్ క్షిపణలు, 2.2 బిలియన్ డాలర్ల విలువైన హై ఆల్టిట్యూడ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్ధను వెంటనే సౌదీకి పంపనున్నట్లు చెప్పారు.

దాంతో సౌదీ యువరాజు కూడా బైడెన్ కోరినట్లు చమురును పంపటానికి అంగీకరించారు. అమెరికా లెక్కల ప్రకారం రోజువారి చమురు వాడకం సుమారు 20 మిలియన్ బ్యారెళ్ళు. మొత్తానికి సౌదీ చమురు దెబ్బకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగొచ్చినట్లయ్యింది.