Begin typing your search above and press return to search.
అమెరికా ఈజ్ బ్యాక్ ... చైనా తో కలిసి పనిచేయడానికి సిద్ధం : జో బైడెన్ !
By: Tupaki Desk | 6 Feb 2021 8:30 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పలు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోని , ప్రపంచంలోని పలు దేశాలతో ఉన్న సత్సంబంధాలని క్షించేలా చేశారు. అయితే , ట్రంప్ హయం లో క్షిణించిన సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అమెరికా ఈజ్ బ్యాక్ అంటూ ప్రకటించారు. అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేశాక గురువారం తొలిసారిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న బైడెన్ తాను అనుసరించబోయే విదేశాంగ విధానాన్ని, లక్ష్యాలను వారితో పంచుకున్నారు. అంతర్జాతీయంగా అగ్రరాజ్యాన్ని తిరిగి బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రపంచదేశాలు నా ఈ మాట వినాలి. అమెరికా ఈజ్ బ్యాక్, అమెరికా ఈజ్ బ్యాక్, మా విదేశాంగ విధానంలో దౌత్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది’’అని చెప్పారు. నిన్నటి సవాళ్లతో మనకి పని లేదు, ఇవాళ,. రేపు ఎదురయ్యే సమస్యలనే మనం పరిష్కరించుకోవాలని, కొన్ని అంతర్జాతీయ సవాళ్లను అందరూ కలసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని బైడెన్ అన్నారు. అమెరికాని ఢీ కొట్టాలని చూసే చైనా, మన దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని గట్టి పట్టుదలతో ఉండే రష్యాలకు గట్టి పోటీ ఇవ్వడానికి అందరూ సన్నద్ధంగా ఉండాలని బైడెన్ పిలుపునిచ్చారు. అయితే అమెరికా ప్రయోజనాలను కాపాడడానికి డ్రాగన్ దేశం ముందుకు వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు.
జర్మనీలో అమెరికా దళాలు కొనసాగుతాయని, ఏడాదికి లక్షా 25 వేల మంది శరణార్థుల్ని దేశంలోకి అనుమతిస్తామని చెప్పారు. యెమన్‌లో సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని మిలటరీకి మద్దతు ఉపసంహరిస్తున్నట్టుగా చెప్పారు. మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సైన్యాన్ని అభ్యర్థించారు. అమెరికా ప్రజాస్వామ్య విలువలు మరింత పెరిగేలా, స్వేచ్ఛాయుత వాతావరణాన్ని సమర్థిస్తూ, విశ్వమానవ హక్కులకి మద్దతునిస్తూ, ప్రతీ వ్యక్తి మర్యాదని కాపాడుతూ, ప్రతీ దేశంలో చట్టాలను గౌరవిస్తూ ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకు నిలబడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం రెండు దేశాలు చేతులు కలపాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ సూచించారు.