Begin typing your search above and press return to search.
భారత్ కు, హెచ్1బీ వీసాదారులకు బిడెన్ గుడ్ న్యూస్
By: Tupaki Desk | 2 July 2020 10:54 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల బరి లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబిడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే తాను అధ్యక్ష పదవిలో మొదటి 100 రోజుల పరి పాలన లో చేపట్ట బోయే కీలక చర్యల పై బిడెన్ తాజా గా సంచలన ప్రకటనలు చేశారు. ట్రంప్ కు పూర్తి వ్యతిరేకం గా భారత్ కు, హెచ్1 బీ వీసా దారులకు గొప్ప తీపి కబురు ను అందించాడు.
డిజిటల్ టౌన్ హాల్ సమావేశం లో మాట్లాడిన బిడెన్ తాజా గా తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తానని భారతీయుల ఓట్లను గెలిచేందుకు హామీల వర్షం కురిపించారు. భారత్ అమెరికా కు మిత్ర దేశం అని.. తమ ప్రభుత్వం ఏర్పడితే అన్ని రకాలు గా సహకరిస్తామని తెలిపారు. కాగా అమెరికా-భారత్ మధ్య తానే అణు ఒప్పందం కుదిర్చినట్టు తెలిపారు.
ఇక భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పారు జోబిడెన్. తాను గెలిస్తే హెచ్1బీ వీసాల పై ట్రంప్ సర్కార్ విధించిన తాత్కాలిక నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తానని ప్రకటించారు. అమెరికా దేశాన్ని నిర్మించారంటూ హెచ్1బీ వీసా దారుల సేవలను కొనియాడారు. ఈ దేశానికి ఎంతో సహకారం అందించిన 11 మిలియన్ల మంది వలసదారుల పౌర సత్వానికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేసి కాంగ్రెస్ కు పంపిస్తానని కీలక ప్రకటన చేశారు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవని.. క్రూరమైనవనీ ఆరోపించారు.
ట్రంప్ తాజాగా హెచ్1బీ వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 60 రోజుల పాటు హెచ్1బీ వీసాలను రద్దు చేసిన అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా దాన్ని డిసెంబర్ వరకూ పొడిగించారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హెచ్1 బీ వీసాలతోపాటు హెచ్2బీ, ఎల్1 వీసాలకు దీన్ని వర్తింప చేశారు. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి వలస వాదులకు అను కూలంగా నిర్ణయం తీసుకోవడం తో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఎటు వైపు నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది.