Begin typing your search above and press return to search.
ట్రంప్ కు తొలిసారి వార్నింగ్ ఇచ్చిన బైడెన్
By: Tupaki Desk | 17 Nov 2020 7:00 AM GMTఫలితాలు పరాజయాన్ని స్పష్టం చేస్తున్నా.. నేను గెలిచాను.. విజయం నాదే.. అంటూ మకుంపట్టు పట్టిన ట్రంప్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారటమే కాదు.. పలువురు తప్పు పడుతున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్న ఆయన.. ఇప్పటివరకు దానికి సంబంధించిన ఆధారాల్ని చూపింది లేదు. మరోవైపు అధికార బదిలీకి ససేమిరా అంటున్న ఆయన తీరుపై తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ స్వరం పెంచారు.
ఇప్పటివరకు ఆచితూచి అన్నట్లు మాట్లాడుతున్న ఆయన.. తాజాగా ట్రంప్ కు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ప్రకటన చేశారు. కరోనా విషయంలో తమతో సహకరించాల్సిందిగా కోరిన ఆయన.. అలా చేయకుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
అధికార మార్పిడిపై ఇప్పటివరకు మాట్లాడని బైడెన్.. అందుకు భిన్నంగా స్పందించారు. వ్యాక్సిన్ ప్రణాళికలు.. జాతీయ భద్రత.. విధానపరమైన సమస్యల్ని అధికార బదిలీ నిమిత్తం ఏర్పాటు చేసిన తన టీంతో పంచుకోవాలన్నారు. లేని పక్షంలో మరింత మంది ప్రాణాల్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధికార మార్పిడికి ట్రంప్ మొండికేస్తున్న వేళ.. బైడెన్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తానుఅధికార బాధ్యతలు చేపట్టే జనవరి 20 వరకు వేచి ఉంటే.. వైరస్ ను కట్టడి చేయటంలో పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ ట్రంప్ నిరాకరిస్తే.. తమ సొంత ప్రణాళికల్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు.
ఇదిలా ఉండగా.. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి మోడెర్నా.. ఫైజర్ నుంచి త్వరలో వచ్చే అవకాశం ఉండటం.. అదే సమయంలో వీటిపై పలు సందేహాలు ఉన్న నేపథ్యంలో బైడెన్ అమెరికన్లకు నమ్మకాన్నికలిగించే ప్రయత్నం చేశారు. ఒకవేళ టీకాపై ప్రజల్లో అనుమానాల్ని పోగొట్టేందుకు తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని పేర్కొన్నారు. అదే చేస్తే.. సందేహాలు తీరిపోయే వీలుందన్న మాట వినిపించింది.