Begin typing your search above and press return to search.

మొండి ట్రంప్ ఫిక్స్ అయ్యాక ప్రపంచం ఇలాంటి సీన్లు చూడాల్సిందే

By:  Tupaki Desk   |   14 Nov 2020 7:50 AM GMT
మొండి ట్రంప్ ఫిక్స్ అయ్యాక ప్రపంచం ఇలాంటి సీన్లు చూడాల్సిందే
X
మొండితనం అంతకు మించిన మూర్ఖత్వం నిండిన నేత ఒకరు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ట్రంప్ జమానాలో చూసి తరించాం. నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అవుతున్న వేళ జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. అయితే.. ఆ గెలుపును తాను పరిగణలోకి తీసుకోనని.. ఎన్నికల్లో తానే గెలిచానని ఫిక్స్ అయిన ట్రంప్.. అందుకు తగ్గట్లు వివిధ న్యాయస్థానాలతో పాటు సుప్రీంలోనూ పిటిషన్లు దాఖలు చేసి న్యాయపోరాటానికి దిగారు.

అదే సమయంలో విజయం సాధించిన జో బైడెన్ కు వరుస షాకులిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు సైతం ట్రంప్ ను ఓటమి అంగీకరించాలని అడిగినా.. ఆయన ససేమిరా అంటున్నారు. అక్కడితో ఆగని ఆయన.. రెండోసారి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్న తీరు సంచలనంగా మారింది. ట్రంప్ మనసుకు తగ్గట్లే.. శ్వేతసౌధంలో రెండోసారి అధ్యక్షుల వారి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసేకుంటున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ వ్యవహారంపై ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నావారో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించేందుకు అవసరమైన చర్యల్ని వైట్ హౌస్ తీసుకుంటుందన్నారు. ఈ తీరు అమెరికా వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ సంచలనంగా మారింది. ట్రంప్ లాంటి మొండి అధినేత ఒకసారి ఫిక్స్ అయితే ఇలాంటివే చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. మరి.. ట్రంప్ మూర్ఖత్వానికి ఎన్నికల్లో గెలిచిన బైడెన్ ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తారో చూడాలి. చూస్తుంటే.. ట్రంప్ పుణ్యమా అని ప్రపంచం.. సిత్రమైన సీన్లను రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.