Begin typing your search above and press return to search.
బైడెన్ పాకిస్థాన్ పక్షపాతా? మోడీ నిర్ణయాలపై కినుకు?
By: Tupaki Desk | 7 Nov 2020 9:50 AM GMTవిజయానికి అడుగు దూరంలో ఉన్న డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్.. గెలుపు లాంఛనమేనన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ట్రంప్ విధానాలు.. వీసాల విషయంలో ఆయన నిర్ణయాలు మనోళ్లను పెట్టిన ఇబ్బందులు అన్నిఇన్ని కావు. దీంతో.. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కచ్ఛితంగా ఓడిపోవాలని.. బైడెన్ గెలవాలని కోరుకున్నారు. ఓట్ల లెక్కింపులో ట్రంప్ వెనుకంజ వేస్తున్న కొద్దీ భారతీయులు పలువురు విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి.
మరి.. బైడెన్ అమెరికా అధ్యక్షుడైతే.. భారత్ తో ఆయన సంబంధాలు ఎలా ఉంటాయి? మోడీ-బైడెన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందన్న ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. వీటికి సమాధానాలు వెతికితే షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. బైడెన్ విజయంతో భారత్ కు ఒరిగే ప్రయోజనం పెద్దగా ఉండదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆయనతో భారత్ కు తలనొప్పులు మరింత పెరిగే అవకాశం ఉందన్న మాటను పలువురు భారతీయులు చెబుతున్నారు.
దీనికి కారణం.. ఆయన పాక్ పక్షపాతిగా పలువురు అభివర్ణిస్తారు. ట్రంప్ హయాంలో పాకిస్తాన్ తీవ్రమైన ఇబ్బందుల్నిఎదుర్కొంది. అప్ఘానిస్తాన్ లో అమెరికా సైనికులపై దాడుల్ని ఆక్షేపిస్తూ ముక్కుసూటితనంతో వ్యవహరించటంతో.. పాక్ కు ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని కూడా నిలిపివేశారు.
ఇదిలా ఉంటే.. భారత్ విషయానికి వస్తే.. మోడీ సర్కారు తీసుకొచ్చిన రెండు కీలకమైన చట్టాలు ఎన్నార్సీ.. పౌరసత్వ చట్టసవరణ లాంటి వాటిని ఆయన బహిరంగంగానే వ్యతిరేకించారు. మోడీ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా చెబుతారు. ఈ వాదనకు కారణం లేకపోలేదు. ఎందుకంటే.. బైడెన్ కు గతంలో పాకిస్థాన్ హిలాల్ - ఇ- పాకిస్థాన్ బిరుదు ఇచ్చింది. ఇవన్నీ చూసినప్పుడు భారత్ తో బైడెన్ తీరు ఎలా ఉంటుందన్న సందేహం కలుగక మానదు.
అయితే.. మిగిలిన సందర్భాలు ఎలా ఉన్నా.. అమెరికా అధ్యక్ష హోదాలో బైడెన్ తీరులో మార్పు ఉంటుందని.. భారత్ తో ఆయన సత్ సంబంధాల్నే కోరుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే మనమ్మాయి కమలా హ్యారీస్ ఈ విషయంలో కీలకభూమిక పోషించే వీలుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.