Begin typing your search above and press return to search.

కరోనా సమయంలో కూడా ఐటీ రంగంలో ఉద్యోగాల వెల్లువ..!!

By:  Tupaki Desk   |   14 Jan 2022 11:30 PM GMT
కరోనా సమయంలో కూడా ఐటీ రంగంలో ఉద్యోగాల వెల్లువ..!!
X
కరోనా వైరస్ ప్రభావంతో చాలా రంగాలు నష్టాలు బాట పట్టాయి. కానీ ఒక్క ఐటీ రంగం మాత్రం ఈ సమయంలోనే మరింత పుంజుకుంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చి వారి చేత పని సులభతరంగా చేయించుకున్నాయి ఐటీ సంస్థలు. ఈ నేపథ్యంలోనే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఇదే విషయాన్ని ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా భారత్ లో ఉన్నటువంటి విప్రో, టిసిఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేశాయి. కరోనా వైరస్ నేపథ్యంలో సంస్థ అప్పజెప్పిన పనులను పూర్తి చేస్తూనే మరోవైపు ఇతర సంస్థల వైపు ఎక్కువ మంది చూసినట్లు సర్వేలో వెల్లడైంది. వివిధ కారణంతో ఇతర సంస్థలు ఇచ్చే అధిక మొత్తానికి చాలా మంది ఉద్యోగులు ఆశపడి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినట్లు తెలిపాయి సదరు సంస్థలు. ఇలా ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు అధిక మొత్తంలో ప్యాకేజీ ఇస్తే మారడాన్ని అట్రిషన్ అని అంటారు.

ఇలా ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారే ఉద్యోగుల రేటు ఎక్కువగా డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఉందని సదరు కంపెనీలు కూడా స్పష్టం చేశాయి. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు ఉద్యోగులు ఎక్కువగా ఎక్కువ జీతంతో పాటు ఉన్నత స్థాయిని కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ ప్యాకేజీ ఇచ్చిన కంపెనీకి వెంటనే మారేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఒక కంపెనీలో సీనియర్ ఉద్యోగిగా ఉండే వ్యక్తి కి టీం లీడర్ ఇస్తానంటే వారు కూడా సాలరీతో పాటు పొజిషన్ కూడా మారుతోందని ఇతర కంపెనీలకు తరలి వెళుతున్నారు. అయితే ఇది కేవలం ఒక కంపెనీలో మాత్రమే జరిగే పని కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి కంపెనీలో జరుగుతోందని వారు పేర్కొన్నారు. నాలుగో త్రైమాసికంలో ఈ అట్రిషన్ రేటు మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మూడేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి త్వరలో విడిచిపెట్టి వెళ్తున్నారని చెప్పారు. ఒక్క డిసెంబర్ నెలలో సుమారు 51 వేల మంది టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లకు తరలి వెళ్లారు.

ఈ అట్రీషన్ రేటు ఎక్కువ ఇన్ఫోసిస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల త్రైమాసికాల్లో ఫలితాలను వెల్లడించిన ఇన్ఫోసిస్ ఈ మేరకు అట్రీషన్ రేటు గురించి కూడా ప్రస్తావించింది. తమ సంస్థలో 25 శాతానికి పైగా అట్రీషన్ రేటు ఉన్నట్లు పేర్కొంది. ఈ సంస్థ నుంచే ఎక్కువ మంది ఉద్యోగులు రాజీనామా చేసి వేరే సంస్థకు వెళ్తున్నట్లు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇన్ఫోసిస్ తరువాత అట్రీషన్ రేటు ఎక్కువగా ఉన్న సంస్థల్లో విప్రో రెండో స్థానంలో నిలిచింది. ఈ సంస్థ నుంచే సుమారు 22 శాతానికి పైగా ఉద్యోగులు ఇతర కంపెనీల వైపు అడుగులు వేసినట్లు సంస్థ తెలిపింది. మూడో స్థానంలో టిసిఎస్ ఉంది. ఈ సంస్థ నుంచి కేవలం 15 శాతం మంది మాత్రమే ఇతర కంపెనీల వైపు అడుగులు వేసినట్లు సర్వేలు స్పష్టం చేశాయి. ఒక సంస్థ నుంచి మరొక సంస్థ కు మారితే సాలరీ బెనిఫిట్స్ తో పాటు ఉన్న పొజిషన్ కూడా మారుతుంది. దీనితో పాటే ఫ్యామిలీ సెక్యురిటి కూడా దొరుకుతుందని ఉద్యోగస్తులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉద్యోగస్తుల నియామకాల్లో ఐటీ సంస్థలు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ ఒక్క టిసిఎస్ సంస్థ 43 వేలకు పైగా ఉద్యోగులను నియమించుకుంది మొదటి రెండో త్రైమాసిక లతో పోలిస్తే మూడో త్రైమాసికంలో ఎక్కువ మంది కి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు టిసిఎస్ స్పష్టం చేసింది.

మరో ఐటి దిగ్గజం విప్రో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లో సుమారు 40 వేలకు పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. కేవలం ఒక్క నాలుగో త్రైమాసికంలో 10 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశం కల్పించినట్లు తెలిపింది. దీంతో ఈ సంస్థలో పని చేసే వారి సంఖ్య సుమారు రెండు లక్షలకు పైగా పెరిగినట్లు సంస్థ తెలిపింది. మరో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా రిక్రూట్మెంట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. సుమారు 15 వేల మందికి పైగా ఉద్యోగులను నియమించు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. మొత్తంగా చూస్తే ఈ మూడు సంస్థలు కలిపి సుమారు లక్ష 34 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు స్పష్టం అయ్యింది.