Begin typing your search above and press return to search.
మంచి తరుణం మించినా దొరకదు.. నిత్యానంద దేశంలో ఉద్యోగాలు!
By: Tupaki Desk | 15 Nov 2022 5:30 PM GMTకొన్నేళ్ల క్రితం ప్రముఖ సినీ నటి రంజితతో రాస లీలలు చేస్తూ గతంలో వీడియో సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు.. నిత్యానంద స్వామి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తే వీడియోను తీసి వైరల్ చేశాడు. కాగా, తన క్రియో యోగా పద్దతి ద్వారా దేశ విదేశాల్లో ఎంతోమంది భక్తులను సంపాదించుకున్నారు.. నిత్యానంద.
కర్ణాటకలో బెంగళూరు సమీపంలోని బిడాడిలో ఉన్న ఆయన ఆశ్రయం నిత్యం కొన్ని వేల మంది భక్తులతో కళకళలాడుతుండేది. కోట్ల రూపాయల్లో విరాళాలు, అడుగులకు మడుగులొత్తే శిష్యులు, దేశవిదేశాల్లో పేరు ప్రతిష్టలు నిత్యానంద సొంతం. అలాంటి నిత్యానంద హీరోయిన్ రంజితతో రాసలీలల్లో మునిగితేలుతూ అడ్డంగా దొరికిపోయాక క్రమంగా తన పేరు ప్రతిష్టలన్నీ పొగొట్టుకున్నాడు.
తర్వాత జైలు పాలయిన నిత్యానంద 2019లో దేశాన్ని వదిలేసి పారిపోయాడు. లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి ప్రత్యేకంగా కైలాస దేశం అని నామకరణం చేశాడు. ఆ దేశాన్ని గుర్తించాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి పెట్టుకున్నాడు. కైలాస దేశం పేరిట వీసాల జారీని కూడా చేపట్టాడు. కైలాస్ డాలర్ పేరుతో కరెన్సీని ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చాలవన్నట్టు కైలాస దేశానికి తనను తాను ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు.
ప్రస్తుతం కైలాస దేశంలోనే ఉంటున్న నిత్యానంద స్వామి ఎప్పటికప్పుడు తన దేశానికి చెందిన తాజా వార్తలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నాడు. అలాగే తనకు చెందిన వార్తలను కూడా దేశ విదేశాల్లో ఉన్న తన భక్తులతో పంచుకుంటున్నాడు. ఇందుకోసం నిత్యానంద స్వామి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ కూడా పెట్టడం గమనార్హం.
కాగా ఇప్పుడు ఏకంగా ఆ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయని, అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని నిత్యానంద స్వామి తాజాగా సూచించారు. ఇండియాలోని తమ ప్రతినిధుల సహాయంతో కైలాసంలో ఉద్యోగాలు చేయవచ్చని ఇంటర్నెట్‌లో తెగ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. తమ శాఖల్లో ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకుని, అర్హత సాధించిన వారికి తమ కైలాస దేశంలో పని చేసేందుకు అవకాశం కల్పిస్తామని నిత్యానంద చెబుతుండటం విశేషం.
అంతేకాకుండా శిక్షణ సమయంలో భృతి కూడా ఇస్తామని ప్రకటించారు. నిత్యానంద హిందూ విశ్వ విద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, విద్యుత్తు శాఖ, గ్రంథాలయం, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస రాయబార కార్యాలయం, కైలాస ఐటీ విభాగం తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని నిత్యానంద స్వామి ప్రతినిధులు వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.