Begin typing your search above and press return to search.
ముంచుకొస్తున్న మాంద్యం.. ఐటీ ఉద్యోగాలకు కష్టం
By: Tupaki Desk | 21 Nov 2022 2:30 AM GMTప్రపంచమంతా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ముప్పునకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతోపాటు బ్రిటన్, జర్మనీ ఇతర యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. అధిక ద్రవ్యోల్బణంతో పలు దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ఆయా దేశాలు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. మాంద్యం ముప్పు, ఆదాయం తగ్గడంతో కంపెనీలన్నీ కూడా ఉద్యోగుల తొలగింపులపైనే పడుతున్నాయి. ఈ పరిణామాలు ఐటీ ఉద్యోగులను వణికిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలోనే మరో భారీ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందని ప్రపంచ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు సర్వేల ప్రకారం మరో 6-12 నెలల్లో తప్పకుండా ఆర్థిక మాంద్యం తప్పకుండా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం మేఘాలు ముసురుకున్నాయని.. డబ్బులు దాచుకోవాలని.. ఎవరూ అనవసరంగా ఈకామర్స్ లో డబ్బులు ఖర్చు చేయవద్దని.. టీవీలు, ప్రీజ్ లు కొనవద్దని స్వయంగా పిలుపునిచ్చారు.
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఇటీవల ట్విటర్, మెటా వంటి సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి. అయితే ఇదే బాటలో అమెజాన్ కూడా వెళ్లింది. ఏకంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు సిస్కో కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించింది.
అమెరికాలో మాంద్యం మబ్బులు కమ్మాయి. 1400 లక్షల కోట్ల అప్పులు కట్టలేని పరిస్థితులు అమెరికా వాసుల్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మందగించింది. మార్కెట్ స్తబ్దత, ఉద్యోగుల కోతతో ఆర్థిక మాంద్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.