Begin typing your search above and press return to search.
హెచ్1బీ వీసాదారులకు ఉద్యోగాలు...ఫేస్ బుక్ పై కేసు
By: Tupaki Desk | 4 Dec 2020 7:25 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లోకల్ సెంటిమెంట్ తో గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అమెరికన్లలో లోకల్ ఫీలింగ్ ఎక్కువైంది. దీంతో, హెచ్ 1బీ వీసాలతోపాటు పలువీసాల నిబంధనలను ట్రంప్ కఠినతరం చేశాడు. తమ ఉద్యోగాలను హెచ్ 1బీ వీసాలతో వేరే దేశాల వారు తన్నుకుపోతున్నారన్న భావనను అమెరికన్లలో కల్పించాడు ట్రంప్. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్...నిబంధనలకు విరుద్ధంగా తమను కాదని హెచ్ 1బీ వీసాల వారికి ఉద్యోగాలిచ్చిందంటూ కేసు నమోదైంది. హెచ్ 1బీ వీసాలున్న వారికి ఉద్యోగాలిచ్చేందుకు ప్రత్యేక విధానాన్ని ఫేస్ బుక్ అవలంబించిందంటూ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్టులో లా సూట్ దాఖలు చేసింది. ఫేస్ బుక్ సంస్థలో 2600 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన అమెరికన్లకు ఉద్యోగాలివ్వకుండా తాత్కాలిక వీసాదారులకు, హెచ్1బీ వీసాదారులకు ఆ ఉద్యోగాలను ఫేస్ బుక్ ఇచ్చిందని ఆరోపించింది.
ఆ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అర్హులైన అమెరికన్లను ఫేస్ బుక్ పరిగణలోకి తీసుకోలేదని డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై రెండేళ్ల విచారణ జరిపిన అనంతరం లాసూట్ ఫైల్ చేశామని తెలిపింది. జనవరి 1, 2018 నుంచి సెప్టెంబరు 18, 2018 వరకు జరిగిన నియామకాల్లో అమెరికన్లపై ఫేస్ బుక్ వివక్ష చూపిందని ఆరోపించింది. అందుబాటులో ఉన్న అర్హులైన అమెరికన్ ఉద్యోగుల కోసం ఫేస్ బుక్ సంస్థ వెతకలేదని, సరైన ప్రకటనలివ్వలేదని ఆరోపించింది. దీంతో, పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ద్వారా అప్ల్లై చేసుకునే అవకాశాన్ని అమెరికన్లు కోల్పోయారని ఆరోపించింది. అయితే, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తాము స్పందిచడం సరికాదని ఫేస్ బుక్ సంస్థ ప్రతినిధి అన్నారు.