Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లో రాజీనామాల స‌వాల్‌

By:  Tupaki Desk   |   2 Nov 2016 10:05 AM GMT
టీఆర్ ఎస్‌ లో రాజీనామాల స‌వాల్‌
X
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటువేయాలనే డిమాండ్‌ - వివిధ హామీల‌ను ప‌క్క‌న‌పెట్టిన వైనంపై తెలంగాణ‌లోని విప‌క్షాలు ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డంపై అధికార టీఆర్ ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ ఎంపీ - టీఆర్ ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు జితేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతుంటే ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాయ‌ని మండిప‌డ్డారు. ఇటీవలి సర్వేల్లో సీఎం కేసీఆర్ అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో తొలిస్థానంలో నిలవ‌డం - మరో సర్వేలో టీఆర్‌ ఎస్‌ కే అధికంగా ఎంపీ - ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని తేలడం ప్ర‌జ‌ల‌కు సంతోషాన్ని ఇస్తుంటే ప్ర‌తిప‌క్షాల‌కు మాత్రం కంట‌గింపుగా మారాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వివిధ సంస్థలు చేసిన ఈ సర్వేలు ఉత్తవేనని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నేతలకు కనీసం త‌మ మాట‌పై త‌మ‌కు న‌మ్మం ఉంటే పదవులకు రాజీనామా చేస్తే వారిపై గెలిచి నిజాలు నిరూపిస్తాం అని ఎంపీ జితేందర్‌ రెడ్డి సవాల్ విసిరారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగానే హామీల అమ‌లులో టీఆర్ ఎస్ స‌ర్కారు ముందుకు సాగుతున్న‌ద‌ని ఎంపీ జితేందర్‌ రెడ్డి వివిరించారు. మెజార్టీ హామీలు పూర్త‌వ‌గా...కొన్ని హామీలు తుది ద‌శ‌లో ఉన్నాయ‌న్నారు. అందుకే ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే ప్ర‌తిప‌క్షాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయ‌ని జితేంద‌ర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసే బ‌దులుగా ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకునేందుకు ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌న్నారు. పార్టీలు మారిన ఎంపీల‌పై తుది నిర్ణ‌యం స్పీక‌ర్ చేతిలో ఉంటుంద‌ని జితేంద‌ర్ రెడ్డి ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీవరకు కేంద్ర మంత్రులను ఎంపీలమంతా కలుస్తామని చెప్పారు. తెలంగాణ రాజపత్రాన్ని 14 ముఖ్యశాఖల కేంద్ర మంత్రులకు సమర్పించి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. కొత్త జిల్లాలకు కేంద్రం నుంచి విద్య - వైద్యం - వ్యవసాయ పథకాలు మంజూరు చేయాలని కోరుతామని జితేంద‌ర్ రెడ్డి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/