Begin typing your search above and press return to search.
గూగుల్ చెప్పిన 1000 కోట్ల డాలర్ల పెట్టుబడి లెక్కలో జియోలోనే సింహభాగం
By: Tupaki Desk | 16 July 2020 7:30 AM GMTవ్యాపారస్తుడు మహా తెలివైనోడు. కారణం లేకుండా ఏ పని చేయడు. ఏదైనా ప్రకటన చేస్తే అందులో తన ప్రయోజనాలే ఉంటాయి తప్పించి.. జనాల్ని ఏదో బాగు చేసేయాలన్నంత పెద్ద మనసు ఉండదు. తాము పెట్టే ప్రతి రూపాయి తిరిగి తమ గల్లాపెట్టెలో పడేలా ప్లాన్ చేస్తారన్నది అస్సలు మర్చిపోకూడదు. దేశం బాగుపడేందుకు తమ వంతు సాయంగా ఏ కంపెనీ పని చేయదు. ఒకవేళ అంత విశాలమైన మనసే ఉంటే.. అది వ్యాపారానికి సూట్ కాదు. తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. దేశ ప్రధానితో భేటీ కావటం తెలిసిందే.
ఈ సందర్భంగా దేశంలో తమ కంపెనీ 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లుగా వెల్లడించింది. ఆ ప్రకటన వెల్లడించిన వెంటనే.. ప్రతి భారతీయుడు సంతోషించాడు. గూగుల్ లాంటి కంపెనీ దేశంలో రూ70వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుండటంతో.. శాస్త్ర సాంకేతికంగా మరింత ముందుకువెళుతుందని.. ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగే వీలుందని ఆశించారు.
దేశ ప్రధాని మోడీతో ఆన్ లైన్ భేటీ కావటమే కాదు.. తాము పెట్టుబడి పెట్టే వెయ్యి కోట్ల డాలర్ల వ్యవహారాన్ని మహా గొప్పగా చెప్పారు. ఇంతా చేస్తే.. తాము పెట్టాలనుకున్న పెట్టుబడిలో మొత్తంలో దాదాపు 50 శాతం (కచ్ఛితంగా చెప్పాలంటే 45 శాతం) జియోలో వాటా కొనుగోలు కోసమే వినియోగించటం చూస్తే.. తెలివంటే గూగుల్ దేనని చెప్పాలి.
జియోలో ఇప్పటివరకూ 30 శాతం వరకు వాటాను వివిధ కంపెనీలు కొనుగోలు చేశాయి. కానీ.. అవేవీ కూడా ప్రధాని మోడీతో భేటీ అయి.. మేం మీ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించేసి.. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న కంపెనీలో వాటాను కొనుగోలు చేసే తీరు చూస్తే.. గూగుల్ ఎంత తెలివైనదని చెప్పక తప్పదు.
మరింత బాగా అర్థం కావాలంటే.. ఏదైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని సదరు రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయి.. మా రాకతో.. మీ రాష్ట్రంలో అద్భుతమైన మార్పు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి.. అప్పటికే రాష్ట్రంలో సక్సెస్ అవుతున్న కంపెనీలో షేర్ కొనుగోలు చేయటాన్ని ఏమనాలి? ఇంచుమించు ఇదే వ్యూహాన్ని గూగుల్ అమలు చేసింది లేదని చెప్పాలి.ఈ లెక్కన తాను పెడతానన్న పెట్టుబడులు కూడా ఇదే తీరులో ఏదైనా కంపెనీల్లో షేరు కొనుగోలు చేస్తే.. లాభం సదరు కంపెనీకి తప్పించి.. ప్రజలకు నేరుగా ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఉండదని చెప్పాలి.
ఎందుకంటే.. తాము పెట్టే పెట్టుబడులన్ని ఇప్పటికే బాగా రన్ అవుతున్న కంపెనీకే చెందుతాయన్నది మర్చిపోకూడదు. ఇప్పటికి సరే.. రానున్న రోజుల్లో పెట్టాల్సిన 55 శాతం పెట్టుబడుల్ని కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తారా? లేదంటే.. జియో తరహాలో మరిన్ని కంపెనీల్ని కొనుగోలు చేస్తారా? అన్నది కాస్త వెయిట్ చేస్తే క్లారిటీ వచ్చేయనుందని చెప్పాలి.