Begin typing your search above and press return to search.

టైమ్ 'టాప్ 100' జాబితాలో జియో, బైజూస్‌ !

By:  Tupaki Desk   |   29 April 2021 6:31 AM GMT
టైమ్ టాప్ 100 జాబితాలో జియో, బైజూస్‌ !
X
ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్‌ అత్యంత ప్రభావవంతమైన 100 ప్రతిష్ఠాత్మక కంపెనీల జాభితాను విడుదల చేసింది. ఆ సంస్థల జాబితాలో తొలిసారి రెండు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. అపర కుబేరుడు ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫామ్స్‌ సహా ఆన్‌లైన్‌ విద్యాసేవల సంస్థ బైజూస్‌ టైమ్‌ ఎంపిక చేసిన సంస్థల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఆరోగ్య సంరక్షణ, వినోదం, సాంకేతికత, రవాణా సహా పలు రంగాల నుంచి టైమ్‌ నామినేషన్లను ఆహ్వానించింది.

గత కొన్నేళ్లలో అతిపెద్ద 4జీ నెట్‌ వర్క్‌ ను స్థాపించిన జియో, ప్రపంచంలోనే అతితక్కువ ధరకు ఇంటర్నెట్‌ అందిస్తోందని టైమ్‌ పొగడ్తల వర్షం కురిపించింది. 410 మిలియన్ల సబ్‌ స్క్రైబర్లు గల ఈ సంస్థ గత ఏడాది 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను రాబట్టిందని గుర్తుచేసింది. ఇక బైజు రవీంద్రన్‌ స్థాపించిన బైజూస్‌ యాప్‌ కు కరోనా టైంలో డిమాండ్‌ పుంజుకుందని టైమ్‌ తెలిపింది. మహమ్మారి సంక్షోభ సమయంలో యూజర్ల సంఖ్య రెట్టింపయ్యిందని పేర్కొంది. భారత్‌ తో పాటు అమెరికా, బ్రిటన్‌, ఇండోనేసియా, మెక్సికో, బ్రెజిల్‌ వంటి దేశాలకూ బైజూస్‌ విస్తరించిందని తెలిపారు. ఈ జాబితాలో టెస్లా, జూమ్‌, అడిడాస్‌, ఐకియా, మోడెర్నా, నెట్‌ ఫ్లిక్స్‌ వంటి సంస్థలు కూడా చోటు దక్కించుకున్నాయి.