Begin typing your search above and press return to search.
చిర్రెత్తుకొచ్చిన ట్రంప్.. రిపోర్టర్ పై ఎదురుదాడి
By: Tupaki Desk | 26 Feb 2020 7:45 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొలాడ్డ్ ట్రంప్ తాజాగా చివరిరోజు నిన్న మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. తన పర్యటన గురించి వివరిస్తూ వారిని ప్రశ్నలు అడగమన్నారు. అయితే భారతీయ విదేశాంగ శాఖ ముందే మన జాతీయ మీడియా ప్రతినిధులకు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చిందట.. ట్రంప్ ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడగవద్దని కోరిందట.. దీంతో దేశం పరువు దృష్ట్యా మన రిపోర్టర్ మిత్రులు ట్రంప్ ను ఇబ్బందిపెట్టని ప్రశ్నలు అడిగి ముగించారు.
అయితే మన మీడియా ఊరుకున్నా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు మాత్రం ట్రంప్ ను వదలలేదు. పైగా పాత పగలు బాగా ఉన్న సీఎన్ఎన్ రిపోర్టర్ మరోసారి ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చే ప్రశ్న అడిగాడు.. దీంతో ట్రంప్ శివాలెత్తిపోయాడు. రిపోర్టర్ పై ఎదురుదాడి చేశాడు. రిపోర్టర్ కూడా తగ్గకుండా ట్రంప్ కు కౌంటర్ ఇవ్వడంతో మీడియా సమావేశంలో వీరి మాటల యుద్ధం హీట్ పెంచింది.
ఇంతకీ సీఎన్ఎన్ ప్రఖ్యాత రిపోర్టర్ అకోస్టా అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ‘వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని నిరాకరిస్తూ అమెరికా ప్రజల ముందు ప్రతిజ్ఞ చేస్తారా? ఎటువంటి అనుభవం లేని వ్యక్తిని నేషనల్ ఇంటెలిజెన్స్ తాత్కాలిక డైరెక్టర్ గా ఎందుకు నియమించారు?’ అని ఈ రెండు ప్రశ్నలను ట్రంప్ ను అడిగేశారు.
దీనిపై సీరియస్ అయిన ట్రంప్.. తనకు ఎన్నికల్లో గెలవడానికి ఏ దేశం సహాయం అవసరం లేదని..సీఎన్ఎన్ ఇది వరకే దీనిపై తప్పుడు కథనాలు రాసి సారీ చెప్పిందని.. నిజం కానీ విషయాలు ప్రసారం చేస్తున్నందుకు సారీ చెప్పాలంటూ ట్రంప్ సదురు రిపోర్టర్ పై ఫైర్ అయ్యారు.
అయితే రిపోర్టర్ కూడా తగ్గలేదు. నిజాన్ని వెల్లడించడంలో మీకంటే మాకే మంచి రికార్డ్ ఉందంటూ ట్రంప్ కే కౌంటర్ ఇచ్చారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ ‘మీ రికార్డ్ చూసి మీరే సిగ్గుపడాలి. రికార్డ్ చాలా ఘోరంగా ఉంది.. ప్రసార చరిత్రలోనే మీకు చెత్త రికార్డ్ ఉంది’ అంటూ నిప్పులు చెరిగారు.
ఇలా సీఎన్ఎన్ రిపోర్టర్-ట్రంప్ మధ్య వివాదం ముదిరిపాకన పడింది. 2018లోనూ ట్రంప్ ను ఇరుకునపెట్టినందుకు ఇదే అకోస్టాకు అమెరికా అధ్యక్ష భవనం పాస్ రద్దు చేయడం విశేషం.