Begin typing your search above and press return to search.
జియాఖాన్ కేసు పక్కదారి పడుతోందా..!
By: Tupaki Desk | 19 Nov 2015 3:59 AM GMTబాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసు విచారణ సా.......గుతోంది. 13, జూన్ 2013లో జియాఖాన్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి - ఆయన కుమారుడు - యువ నటుడైన ఆదిత్య పంచోలి - జెరీనా వహబ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విషయమై సూరజ్ పంచోలికి గతంలోనే బెయిల్ మంజూరైంది. కేసు విచారణ రెండు సంవత్సరాలుగా సాగుతున్నా ఇప్పటకీ కొలిక్కి రాకపోవడంతో సీబీఐ ఈ కేసును పక్కదారి పట్టిస్తోందని మహిళా పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది. ఈ సమితి ఆధ్వర్యంలో ఈ కేసు విషయమై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వీరంతా జియాఖాన్ కుటుంబానికి అండగా ఉన్నారు.
జియా ఆత్మహత్య చేసుకుని రెండు సంవత్సరాలవుతున్నా సీబీఐ ఇప్పటికి కూడా సరిగా ఛార్జ్‌షీట్ ను ఫిల్ చేయలేదు. దీంతో కేసును సీబీఐ సరిగా విచారించడం లేదని...సూరజ్ పంచోలి కుటుంబానికి అనుకూలంగా సీబీఐ వ్యవహరిస్తోందంటూ గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ నిమిత్తం సూరజ్ పంచోలి ఈ రోజు న్యాయస్థానానికి హాజరయ్యాడు. దీంతో ముంబై మహిళా సెషన్స్ కోర్టు ఈ కేసు విచారణ ఎక్కడ వరకు వచ్చింది....అసలు పురోగతి ఏమైనా ఉందా అని సీబీఐని ప్రశ్నించింది.
తక్కువ వయస్సులోనే మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్యపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక రకాలైన చర్చలు జరిగాయి. సరైన ఆఫర్లు లేక ఆత్మహత్యకు చేసుకుందని కొందరు అంటే..... ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ తో ప్రేమాయణం బెడిసి కొట్టడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
2007లో జియాఖాన్ వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. అదీ బిగ్ బీ అమితాబ్ తో 'నిశ్శబ్ద్' చిత్రంలో నటించి ఉత్తమ అరంగేట్రం నటిగా పురస్కారం కూడా దక్కించుకుంది. ఆ తర్వాత ఆరేళ్ల కెరీర్ లో అమీర్ ఖాన్ తో గజినీ - అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ చిత్రాల్లో మాత్రమే నటించింది. జియా అసలుపేరు నఫీసాఖాన్. ఆమె న్యూయార్క్ లో జన్మించింది. షారుఖ్ ఖాన్ 'దిల్‌సే' చిత్రంలో బాలనటిగా కనిపించింది.