Begin typing your search above and press return to search.

మాస్క్ లేకపోతే రూ. లక్ష ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష .. ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   23 July 2020 12:30 PM GMT
మాస్క్ లేకపోతే  రూ. లక్ష ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష .. ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం !
X
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడంలేదు , రోజురోజుకి కరోనా విజృంభణ పెరుగుతూనేఉంది. అలాగే దేశంలో రోజురోజుకూ నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 45,720 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో భారత్‌ లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. అలాగే దేశంలో ఇప్పటి వరకు 29,861 మంది మరణించారు. వైరస్ దేశంలో విలయతాండవం చేస్తున్నా కూడా కొంతమంది తమకి సోకదులే అన్న భావనలో కనీస నియమాలని కూడా పాటించడంలేదు.

ఈ తరుణంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా జనావాసాల్లోకి వస్తే లక్ష రూపాయల ఫైన్.. రెండేళ్ల జైలు శిక్ష అంటూ కీలక ప్రకటన చేసింది. దీనిపై కొంతమంది విమర్శలు చేస్తున్నప్పటికీ ఈ మాత్రం ఫైన్ ఉంటేనే బయటకి రాకుండా ఉంటారు అని చాలామంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం బుధవారం అత్యవసరంగా ‘ఇన్‌ఫెక్షియస్ డిసీస్ ఆర్డినెన్స్ -2020’ని తీసుకొచ్చింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగినా, ఇతర కరోనా నిబంధనలను ఉల్లంఘించినా రూ. లక్ష జరిమానా విధించినున్నట్లు ఆర్డినెన్స్‌లో చేర్చింది. అలాగే , రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించనున్నట్లు తెలిపింది. జార్ఖండ్ క్యాబినెట్ ఈ ఆర్డినెన్స్‌ కు బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో జార్ఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, జార్ఖండ్‌ లో మొత్తం ఇప్పటివరకు 6,682 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,048 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,570 కేసులు ఉన్నట్లు జార్ఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 64కు చేరుకుంది.