Begin typing your search above and press return to search.

మరో రాష్ట్ర ఎన్నిక‌ల న‌గారా మోగింది...

By:  Tupaki Desk   |   1 Nov 2019 1:55 PM GMT
మరో రాష్ట్ర ఎన్నిక‌ల న‌గారా మోగింది...
X
మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే... ఇంకా మహారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం కూడా ఏర్పాటు కాక‌ముందే... దేశంలో మ‌రోసారి ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిచింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఇక తక్ష‌ణ‌మే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్ధానాలు ఉన్నాయి. అన్ని స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నెల 6న నోటిఫికేష‌న్ రిలీజ్ అవుతుంది. నవంబర్‌ 30న తొలి దశ పోలింగ్‌ - డిసెంబర్‌ 7న రెండో దశ - డిసెంబర్‌ 12న మూడో దశ - డిసెంబర్‌ 16న నాలుగో దశ - డిసెంబర్‌ 20న అయిదో దశ పోలింగ్‌ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. ఇక వచ్చేఏడాది జనవరి 5తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. డిసెంబర్‌ 23న ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.

ఇక జార్ఖండ్‌ లో ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అవిభ‌క్త బిహార్‌ లో ఉన్న జార్ఖండ్ 2000లో విడిపోయింది. రాష్ట్రం విడిపోయాక జ‌రుగుతున్న ప్ర‌స్తుతం నాలుగోసారి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇక 2014 డిసెంబ‌ర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ 37 స్థానాల్లో గెలవగా.. ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌ యూ) 5 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ప్ర‌భుత్వ ఏర్పాట‌కు అవ‌స‌ర‌మైన 41 స‌భ్యుల బ‌లం రావ‌డంతో వీరు క‌లిసి ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత మ‌రో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిపోయారు.

ఐదేళ్ల పాటు బిహార్‌ లో స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న కొన‌సాగింది. ఇక తాజాగా మాహారాష్ట్ర‌ - హరియాణా ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్ త‌గ‌ల‌డంతో ఈ సారి ఇక్క‌డ వ‌న్‌సైడ్‌గా విజ‌యం సాధించాల‌ని బీజేపీ అప్పుడే స్కెచ్‌ లు వేసేస్తోంది. ఇక ఇటీవ‌ల జ‌రిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి బీజేపీ సునాయాస‌నంగా విజ‌యం సాధిస్తుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నాలు - ఎగ్జిట్‌ పోల్స్ వెలువ‌డినా అవ‌న్నీ త‌ల్ల‌కిందులు అయ్యాయి. మ‌రి ఇప్పుడు జార్ఖండ్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో ? చూడాలి.