Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఊరట: బీజేపీ కి పరాభవాల పరంపర

By:  Tupaki Desk   |   23 Dec 2019 5:05 AM GMT
కాంగ్రెస్ కు ఊరట: బీజేపీ కి పరాభవాల పరంపర
X
దేశాన్ని మోడీ కి ఇస్తున్న ప్రజలు రాష్ట్రాలను మాత్రం తమకు ఇష్టమైన పరిపాలన దక్షతులకే కట్ట బెడుతున్నారు. దేశంలో రాహుల్, మోడీలను పోల్చి చూసి మోడీ కి పట్టం కడుతున్న జనాలకు రాష్ట్రాల కు వచ్చే సరికి మోడీ ని అస్సలు పట్టించుకోవడం లేదు. స్థానిక బలమైన నాయకత్వానికే పట్టం కడుతున్నారు.. తాజాగా వరుసగా రాష్ట్రాల్లో బీజేపీ కి ఓటములు ఎదురవుతున్నాయి. మహారాష్ట్ర లో మునిగిన బీజేపీ ఇప్పుడు జార్ఖండ్ లో ఓటమి దిశగా సాగుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో 300 పైగా సీట్లు సాధించి దేశం లో అధికారం లోకి వచ్చిన బీజేపీ కి రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు మాత్రం షాకుల మీద షాకులిస్తున్నాయి. దేశంలో ఓడిన కాంగ్రెస్ మాత్రం ఆయా రాష్ట్రాల్లో పొత్తుల తో స్థానిక పార్టీల తో జట్టు కట్టి బీజేపీ ని చిత్తు చేస్తోంది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో పోయిన ఏడాది డిసెంబర్ లో బీజేపీ ని మట్టి కరిపించిన కాంగ్రెస్ పార్టీ.. మహారాష్ట్ర లో శివసేన, ఎన్సీపీ తో పొత్తు తో బీజేపీ ని చిత్తు చేసింది. ఇప్పుడు జార్ఖండ్ లోనూ జేఎంఎం తో జట్టు కట్టి మేజిక్ మార్క్ కు ఒక్క సీటు దూరం లో ఆగి పోయింది. ఫలితాలు పూర్తి అయ్యే వరకు మేజిక్ మార్క్ అందుకునే అవకాశాలున్నాయి.

ఇలా వరుసగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిని కాంగ్రెస్ పొత్తుల సంసారం తో చేజిక్కించుకుంటూ బీజేపీ కి గట్టి షాక్ ఇస్తోంది. సొంతంగా గెలవలేని స్థితి లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానైనా బలమైన బీజేపీ ని రాష్ట్రాల్లో ఓడిస్తూ బలం పెంచుకుంటోంది. ఇదే క్రమం కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ కి షాక్ తప్పదా అన్న అంచనాలు నెలకొంటున్నాయి.