Begin typing your search above and press return to search.

బీజేపీ కి మరో షాక్.? జార్ఖండ్ లో కాంగ్రెస్ కే ఛాన్స్

By:  Tupaki Desk   |   23 Dec 2019 4:56 AM GMT
బీజేపీ కి మరో షాక్.? జార్ఖండ్ లో కాంగ్రెస్ కే ఛాన్స్
X
మహారాష్ట్ర లో వలే జార్ఖండ్ లోనూ బీజేపీకి షాక్ తగిలేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సోమవారం వెలువడుతున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఉదయం 10.30 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి 41 స్థానాలతో ముందంజ లో ఉంది. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో మేజిక్ మార్క్ 42. దీంతో ఒకే ఒక స్థానం తో కాంగ్రెస్ కూటమి వెనుకబడింది.

ఇక బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేవీఎం 4, ఏజేఎస్యూ 2 స్థానాల్లో, ఇండిపెండెంట్స్ 4 స్థానాల్లో ఆధిక్యం లో ఉన్నారు. ఈ నలుగురు కలిసినా 40 స్థానాల్లో మాత్రమే బీజేపీ బలం అవుతుంది.

దీన్ని బట్టి హంగ్ కనుకవస్తే కాంగ్రెస్ కూటమి కే గెలుపు అవకాశాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల వరకూ తుది ఫలితాలు వెల్లడి వరకూ ఎదురుచూడాల్సిందే. కాంగ్రెస్-జేఎంఎం కూటమి మిగతా 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటే అధికారం దక్కడం ఖాయం. మరి తుది ఫలితాల వరకూ కాంగ్రెస్ ఆధిక్యత చాటుకుంటుందా? లేదా హంగ్ వస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.

ఒక వేళ బీజేపీ, కాంగ్రెస్ కూటములు ఆధిక్యత చాటు కోకపోతే జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), అఖిల భారత జార్ఖండ్ విద్యార్థి యూనియన్ (ఏజేఎస్యూ)లు కీలకంగా మారనున్నాయి. ఇవి కింగ్ మేకర్లు అవుతాయి. బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి మద్దతిస్తే వారిదే అధికారం.. డిప్యూటీ సీఎం పోస్టు తో వీటిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు రెడీ అయ్యాయి. జార్ఖండ్ లో హంగ్ వస్తే బేరసారాలకు అవకాశం దక్కుతుంది

అయితే కేవలం 1 స్థానం మాత్రమే వెనుకబడి ఉండడం తో దాదాపు కాంగ్రెస్ కూటమి కే జార్ఖండ్ అధికారం అని స్పష్టమవుతోంది. బీజేపీ కి షాక్ తగలడం ఖాయమంటున్నారు. మహారాష్ట్ర లో లాగానే జార్ఖండ్ కూడా చేజారితే బీజేపీ కి అంతకుమించిన అవమానం లేదు. మరి తుది ఫలితాల తర్వాత ఎవరిది అధికారం అనేది తేలనుంది.